20, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే పాట లిరిక్స్ - Aaku Chaatu Pinde Thadise Komma Song Lyrics in Telugu - Vetagadu (1979) Telugu Songs Lyrics
















చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 






ఆకు చాటు పిందె తడిసే .. 
కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. 
కొమ్మ చాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు గువ్వ తడిసే .. 
గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. 
గుండె మాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది  

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే 
అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే 
అహ అహ .. అహ అహ

ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..  
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే 
అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే 
అహ అహ .. అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... 
అహ
నీ విరుపులే ముడుపు లిచ్చిచలిని పెంచి .. 
చెలిమి పంచితనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ .. 
ఆకు చాటు పిందె తడిసే.. ఆహా అహా అహా అహా 
కొమ్మచాటు పువ్వు తడిసే.. ఆహా అహా అహా అహా 
 ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మచాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి