26, ఫిబ్రవరి 2022, శనివారం

లాహిరి లాహిరి లాహిరి లో పాట లిరిక్స్ - Laahiri Laahiri Laahirilo Song Lyrics in Telugu - Laahiri Laahiri Laahiri (2002) Telugu Songs Lyrics

















చిత్రం : లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఉన్నికృష్ణన్, సునీత 





అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ.. అం అహా..
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ అం అహా
అను అక్షరాలే తోడుగా
పడమర ఎరుగని సూర్యుడు నాన్న 
పున్నమి జాబిలి మా అమ్మ
ముచ్చట తీరా ముగ్గురు అన్నల 
ముద్దుల చెల్లిగ పెరిగిన మన కథ

లాహిరి లాహిరి లాహిరి లో
మన అందరి గుండెల సందడిలో  
లాహిరి లాహిరి లాహిరి లో 
మన అందరి గుండెల సందడిలో 

చందురున్నే దారంకట్టి 
దించుకుందాం ఎంచక్కా
దీపమల్లే పెట్టడానికి
ఓ తారలన్నీ హారంకట్టి 
తెచ్చుకుందాం సరదాగా
బొమ్మరింటి తోరణానికి

పండగ సందళ్ళే 
నిండిన మా ఇల్లే 
రంగుల హరివిల్లే
కోవెల గంటల్లే 
కోయిల పాటల్లే 
సరదాల అల్లరే
కళ్ళలో కాంతులే దీపావళి
కల్లలు ఎల్లలు కనివిని ఎరుగని

లాహిరి లాహిరి లాహిరి లో 
చిరునవ్వుల మువ్వల సవ్వడిలో
లాహిరి లాహిరి లాహిరి లో 
చిరునవ్వుల మువ్వల సవ్వడిలో

ఏం వయస్సో ఏమోగాని 
చెప్పకుండా వస్తుంది
తేనెటీగ ముల్లు మాదిరి
ఓ.. ఏం మనస్సో ఏమోగాని 
గుర్తుచేస్తూ ఉంటుంది
నిప్పులాంటి ఈడు అల్లరి

ఒంటరి వేళల్లో 
తుంటరి ఊహల్తో
వేధిస్తూ ఉంటుంది
తోచిన దారుల్లో 
దూసుకు పోతుంటే
ఆపేదెలా మరీ
ఎవ్వరో ఎక్కడో ఉన్నారని
గువ్వలా గాలిలో ఎగిరిన మది కథ

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ 
ఒ ఓ ఔ అం అహా
అని ఆగనంటూ సాగదా
మనసును చిలిపిగ పిలిచిన ప్రేమ
వయసుని తరిమిన ఆ ప్రేమ
కోరిన జంటను చేరేదాక 
ఒక క్షణమైనా నిలువని పరుగుల

లాహిరి లాహిరి లాహిరి లో 
తొలివలపులు పలికిన సరిగమలో 
లాహిరి లాహిరి లాహిరి లో 
తొలివలపులు పలికిన సరిగమలో




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి