26, ఫిబ్రవరి 2022, శనివారం

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ గానామృత రసవిదులూ కోవిదులు పాట లిరిక్స్ -Brahmalu Guru Bhrahmalu Gaanamrutha Song Lyrics in Telugu - Egire Paavurama (1997) Telugu Songs Lyrics




















చిత్రం : ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి    
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 







బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు

శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు

శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

వేదమూర్తులై నాద యోగ సాధకులై
పరమొకటే కోరుకున్న ఆ స్వర ధనులెవరో
తెలసి తలచి నా ఉపాధికై రాగ భావ జాలనలో
గతివిడిచీ పాడుకున్న నా అభినవ జతినే
వలచి మలచి తీసానులే కొత్త రాగమే హా హా
అ అ అ అ వేశానులే... ఆది తాళమే...
పదమునాకు మనుగడకాగా 
లయలు జతులు క్రియలు ప్రియముకాగా 
జగతినెరిగి సుగమగతులనడిగె...

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

త్యాగబ్రహ్మమూ తాళ్ళపాక అన్నమయా
జపియించే భక్తి భావనా సురభిళకృతులే
తలచి తరచీ నూతనత్వమే 
కోరుకున్న అభిరుచులే
గమనించీ నవ్యరీతిలో 
గమకపు లయతో కలిసి మెలిసి 
సాగేనులే బాటసారిగా ఆ...ఆఆఆ..
సంగీతమే జీవనాడిగా...
తెలుగు పాట జగతికి చాట 
చిలిపి వలపు కలిపి పదము పాడ 
మనసు నిలిపి మధుర జతుల తేలె.

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

సనిపమా నిపమనీ రిగరిస
సనిపని సనిపమ పనిపమ రిగరిస
నిసరిగరి నిసరిపమ సరిమపని సరిమపప
రిప పనిప మప నిసరిస రిసనిపనిస సనిపదనిప
మపరిగరిస నిసరిమ నిసరిమప రిమపని
రిమపనిస మపనిస మపనిసరిస 
ఆ... ఆ... ఆఆ....







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి