15, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది పాట లిరిక్స్ - Ee Reyi Theyanadhi Ee Chirugaali Manasainadhi Song Lyrics in Telugu - Chitti Chellelu (1970) Telugu Songs Lyrics
















చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల







ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది 

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి