దేవా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2022, సోమవారం

చిలకమ్మా ప్రతి రేపవలూ వెంటాడినదే నీ జ్ఞాపకం పాట లిరిక్స్ - Chilakamma Prathi Repavalu Ventadinadhe Nee Gnapakam Song Lyrics in Telugu - Aasa Aasa Aasa (2002) Telugu Songs Lyrics









చిత్రం : ఆశ ఆశ ఆశ (2002)

సంగీతం : దేవా 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఉన్నికృష్ణన్, అనురాధ 

 


చిలకమ్మా ప్రతి రేపవలూ 

వెంటాడినదే నీ జ్ఞాపకం

అమ్మమ్మా తొలిచూపులనీ 

కనుపాపలలో నా కాపురం 

చిన్న చిన్న కలతలు 

చిన్న చిన్న అలకలు

వచ్చిపోయె అతిథులు మనకే 

వంద ఏళ్ళ బంధనాల 

తీపి ఏమి మారిపోదు

రోజువారి ఇంటిగొడవలకీ

ప్రేమన్నది ఉన్నచోటా 

ఆఆఆఆ.. 

కలహం ఒక చిన్న ఆటా 

ఆఆఆఆ.. 

 

చిలకమ్మా ప్రతి రేపవలూ 

వెంటాడినదే నీ జ్ఞాపకం

 

మరుమల్లెల మంచంలో

చిరు చీకటి దుప్పటిలో

సరికొత్త రకం సరదాల సుఖం

సరసంగా నేర్పేదా

అటు జాబిలి చూస్తోందీ

కిటికీ తెరిచే ఉందీ

తెలుపెయ్యకనే తంటాలు పడే 

ఈ తొందర తప్పు కదా

ఆలు మగలమేగా అంత దూరమేలా

మోజు తీర్చగా మెల్లగా చల్లగా చేరవా

 

చిలకమ్మా మొహమాటపడి

మోహాన్ని మరీ పెంచావే

అమ్మమ్మా మాటే వినని 

మహ మొరటుతనం నేర్చావే

 

ఆ తొలిరోజుల తమకం

ఈ పెదవుల చలి గమకం

అది ఇప్పటికీ నా ప్రతి అణువు 

దాచిందే పదిలంగా 

ప్రతి పూటా చీరలనీ 

నగలే తెచ్చివ్వమనీ

వేధించాగా సాధించాగా 

గురుతుందీ నాకింకా 

తగవు మరిచి పోవే

తనువు మరిచి రావే

ఆశతీరగా వడిగా ఒడిలో పడవే

 

చిలకమ్మా నను చేరుకుని 

నా చేతులకీ పని చెప్పు మరీ

అమ్మమ్మా ఊరించకనే 

ఒడిచేర్చుకుని ఓదార్చు మరీ

 


 

16, జులై 2021, శుక్రవారం

ఏమయిందో ఏమో ఈ వేళ పాట లిరిక్స్ - Emaindo Emo Ee Vela Song Lyrics in Telugu - Toliprema (1998) Telugu Songs Lyrics



















చిత్రం : తొలిప్రేమ (1998)
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం









(( స్పానిష్ లిరిక్స్ ))
Uépa

Un, dos, tres un pasito pa'delante María
Un, dos, tres un pasito pa' atrás
Un, dos, tres un pasito pa'delante María
Un, dos, tres un pasito pa' atrás

Uépa...

Un, dos, tres...

Uépa

(ఇంగ్లీష్ అర్థం) 
(One, two, three,
One small step forward with Maria.
One, two, three,
One small step back.)

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

వెతకాలా వైకుంఠం కోసం 
అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే 
నీ సొంతం అయితే
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో 
గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే 
పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా

జనులారా ఒట్టేసి చెబుతా 
నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే 
అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ