చిత్రం : సమురాయ్ (2004)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : హ్యరీస్ జయరాజ్
గానం : టిప్పు
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే
నేలతల్లి ఓడిలో పుట్టి
బతుకు బడిలో హృదయం మరచి
విసిగిపోయిన మనుషుల మనసే
నింగికెగసే గువ్వయి పోతే
మజాలే మజాలే మజాలే ......
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే
చిత్తడి చినుకుల్లో పూచిన ఎర్రని తామరలా
వేళ్లు మలినమైన పువ్వుల వాసన తరగదులే
ఊడలు దిగుతున్నా మర్రికి నీడలు తరగవులే
నేలన పడివున్నా పువ్వుల అందం తరగదులే
తామరపువ్వుగా మారాలి జల సాఫల్యాన్ని పొందాలి
మానుగానైనా మారలి ప్రతివారికి నీడను ఇవ్వాలి
పువ్వై, కాయయి, ఫలమై
పదిమందికి నే బ్రతుకును పంచాలి
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే
ఉప్పు సముద్రంలో మేఘం పుట్టుకువస్తున్నా
ఉప్పుని ఏమాత్రం మేఘం జల్లనే జల్లదుగా
పడమటి కొండల్లో సూర్యుడు మరుగున పడుతున్నా
పున్నమి చంద్రుడికి తానే వెన్నెలనిస్తాడే
మేఘంలాగ మారాలి తీయ తియ్యని నీరే ఇవ్వాలి
సూర్యునిలాగ మారాలి మన వెలుగులు జగతిలో నింపాలి
జననం మరణం అన్నీ మరచి
నే ఓ శిశువుని అవ్వాలి
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
(పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే)
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే
నేలతల్లి ఓడిలో పుట్టి
బతుకు బడిలో హృదయం మరచి
విసిగిపోయిన మనుషుల మనసే
నింగికెగసే గువ్వయి పోతే
మజాలే మజాలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి