రమేష్ నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రమేష్ నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2022, మంగళవారం

నీలాలు కారేనా కాలాలు మారేనా పాట లిరిక్స్ - Nelaalu Kaarena Kaalaalu Maarena Song Lyrics in Telugu - Mudda Mandaram (1981) Telugu Songs Lyrics



















చిత్రం : ముద్దమందారం (1981)
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

సూరీడు నెలరేడు 
సిరిగల దొరలే కారు లే
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో 
వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ 
నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో 
కలతారి పోవాలి లే
ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె 
కడతేరి పోవాలిలే..

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా 
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా







ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే పాట లిరిక్స్ - Priye Charuseele Priye Charuseele Song Lyrics in Telugu - Megha Sandesam (1984) Telugu Songs Lyrics



























చిత్రం : మేఘసందేశం (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : జయదేవుడు, పాలగుమ్మి పద్మరాజు
గానం : కె.జె.ఏసుదాసుపి.సుశీల 
 







ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥


ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
 
 వదసి యది కించిదపి దంత రుచి కౌముదీ
హరతి దర తిమిరమతిఘోరం ।
పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు
కలికి నా ఎడద చీకటుల పో ద్రోలు
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరమ్‌ ॥
నీ మోము జాబిల్లి మోవి తేనియలు
నా నయనమ్ములు చకోరమ్ములై గ్రోలు

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!

నా పైని అలకేమి ఓ కామినీ 
నా పైని అలకేమి ఓ కామినీ
నా మేన నఖ ముద్ర కెంపులే వెలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
గాఢంపు సుఖము నా కటులైన కలుగనీ
ఓ... కామినీ... 

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!








2, మార్చి 2022, బుధవారం

శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని పాట లిరిక్స్ - Sivaranjani Navaraagini Vininanthane Song Lyrics in Telugu - Thoorpu Padamara (1976) Telugu Songs Lyrics





















చిత్రం : తూర్పూ పడమర (1976)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం








శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని
ఆఆఆఆఆ...ఆఆఆఆ...
శివరంజని నవరాగిణీ.. ఆఆఆ... 

 
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
సరస హృదయ వీణా వాణివీ

శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ..

జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే...ఏఏఏ.. రావే నా శివరంజని..
మనోరంజని.. రంజని నా రంజని
నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ