2, మార్చి 2022, బుధవారం
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగ ముంది పాట లిరిక్స్ - Veena Naadhi Teega Needi Teega Chaatu Song Lyrics in Telugu - Katakatala Rudrayya (1978) Telugu Songs Lyrics
13, జనవరి 2022, గురువారం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం పాట లిరిక్స్ - Ye Vodilo Nee Jananam Ye Kadaliko Song Lyrics in Telugu - Tarangini (1982) Telugu Songs Lyrics
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ
ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ గమ్యం చేరేదాకా..ఆ..ఆ..ఆ..ఆ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
గుండె ముక్కలయిపోయి..సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కాలమే వంచించినా..ఆ..ఆ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నీళ్ళు పొంగుతున్నాయో..ఓ..ఓ....
తెలిసేదెవరికీ..హ..హ ఆ దైవానికి
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ
ఓ..తరంగిణి..ఓ తరంగిణి...ఓ తరంగిణి..ఓ..తరంగిణి..
ఒక దేవత ప్రేమ దేవతా పాట లిరిక్స్ - Oka Devatha Prema Devatha Song Lyrics in Telugu - Tarangini (1982) Telugu Songs Lyrics
చిత్రం : తరంగిణి (1982)
సంగీతం : జె.వి.రాఘవులు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ
నిర్మల సుర గంగాజల
మంజుల స్వర్ణకమలమో
క్షీరసాగర సమానీత
సుధాపూర్ణ కలశమో
ఆ ..ఆ..ఆ...ఆ..ఆ.
ఒక దేవత ప్రేమ దేవతా
పోత పోసిన అనురాగమో
ఏపూర్వజన్మల ప్రణయ
రమ్య రసయోగమో
ఒక దేవత ప్రేమ దేవతా
ఎదలో సూటిగా పదునుగా
నాటిన మదన బాణమో
పద పదమున మధు
మధురిమలోలికిన
రసోన్మాదమో..హొయ్
ఒక దేవత ప్రేమ దేవతా
రసికత దాచిన శృంగారమో
ఆ రతీదేవి ధరియించిన
తొలి అవతారమో...హాయ్..
ఒక దేవత ప్రేమ దేవతా
హా..ఆఆఅ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హృదయమే సుమ హారముగా అర్పించనా
జీవితమే కర్పూరముగా వెలిగించనా
ఆరాధన మాటున దాగిన
ఆవేదన ఎలా తెలుపను
మనసులోన రగిలే కలతను
మాటలతో ఎలా చెప్పను
హహ హహహహ
ఆరాదన ఒక నటన
ఆవేదన ఒక నటనా హహ
రసయోగం ఒక నటన
ఆ అనురాగం ఒక నటనా
అది నటనయని వంచనయని తెలిసెనులే
ఇక ఆ దేవత ఆ గుడిలో నిలవదులే
కోరుకున్న కోవెలలో చేరునులే
సరికొత్త ప్రేమ పూజలందితీరునులే
స్వార్ధం ఎరుగదు ప్రేమ
పరమార్ధం మరువదు ప్రేమ
ఆ ప్రేమకు రెండే అక్షరాలూ
అవి గగనాలు సాగరాలు
అవి అందుకోలేరు కాముకులూ
అవి పొందగా లేరు వంచకులూ
ఆ దేవతా ప్రేమ దేవతా
ఆ దేవతా ప్రేమ దేవతా
మదిలో వెలసిన మాధవుడే
ఎదురై నిలిచిన రాఘవుడే
ప్రియ విభుడు..
నా ప్రియ విభుడు..