2, మార్చి 2022, బుధవారం
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదూ పాట లిరిక్స్ - Medante Medaa Kaadhu Goodante Song Lyrics in Telugu - Sukha Dukkhalu (1968) Telugu Songs Lyrics
1, మార్చి 2022, మంగళవారం
నా పేరు బికారి నా దారి ఎడారి పాట లిరిక్స్ - Naa Peru Bikaari Naa Dhaari Edaari Song Lyrics in Telugu - Sri Rajeswari Vilaas Coffee Club (1976) Telugu Songs Lyrics
11, జనవరి 2022, మంగళవారం
ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం పాట లిరిక్స్ - Ela Ela Daachavu Alavi Kaani Anuraagam Song Lyrics in Telugu - Gorintaaku (1979) Telugu Songs Lyrics
చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ...
పిలిచి పిలిచినా పలుకరించినా
పులకించదు కదా నీ ఎదా
ఉసురుసురనినా గుసగుసమనినా
ఊగదేమది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో
నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో..
ఆరాటములెన్నో..
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....
తలుపులు తెరుచుకొని
వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపూ
చొరబడతారా ఎవరైనా?
దొరవో... మరి దొంగవో
దొరవో... మరి దొంగవో
దొరికావు ఈనాటికీ...
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ
నంగనాచినసలే కానూ...
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..