సానాపతి భరధ్వాజ పాత్రుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సానాపతి భరధ్వాజ పాత్రుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, డిసెంబర్ 2021, మంగళవారం

సంధ్యా..! పదపద పదమని పాట లిరిక్స్ - Sandhyaa Padapadamani Song Lyrics in Telugu - Middle Class Melodies (2020) Telugu Songs Lyrics










చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్‌ (2020)

సంగీతం : స్వీకార్ అగస్తి

సాహిత్యం : సానాపతి భరధ్వాజ పాత్రుడు,

గానం : స్వీకార్ అగస్తి


 

సంధ్యా..! పదపద పదమని 

అంటే సిగ్గే ఆపిందా

బావా..! అని పిలిచేందుకు 

మోమాటంతో ఇబ్బందా

 

నువు వణక్క, తొణక్క, బెరక్క 

సరిగ్గ ఉంటే చాలే

కథ వెనక్కి జరక్క చురుగ్గ 

కొలిక్కి త్వరగా వస్తాదే

ఇది వయస్సు విపత్తు 

ఒకింత తెగించి ఉంటే మేలే

విధి తరించి తలొంచి 

కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

 

మధ్యలో ఉన్నదీ దగ్గరో దూరమో 

కాస్తయినా తెలిసిందా

ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం 

ఏమైనా బాగుందా ఆఆ

మాటలని కుక్కేశావే మనసు నిండా

వాటినిక పంపేదుందా పెదవి గుండా

బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక

అది ఎంతో అపచారం అని అనుకోవే సిలకా

 

సంధ్యా..! పదపద పదమని 

అంటే సిగ్గే ఆపిందా

బావా..! అని పిలిచేందుకు 

మోమాటంతో ఇబ్బందా

 

ఏం సరిపోద్దే నువు చూపే ప్రేమా

ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా

పైకలా అవుపిస్తాడే ఎవరికైనా

వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా

విసిరావో గురిచూసి వలపన్న బాణమే

పడిపోదా వలలోన పిలగాడి ప్రాణమే

 

సంధ్యా..! పదపద పదమని 

అంటే సిగ్గే ఆపిందా

ఔనే..! పొగరుని ప్రేమతో 

మనిషిని చేస్తే మీ బావే

నువు వణక్క, తొణక్క, బెరక్క 

సరిగ్గ ఉంటే చాలే

కథ వెనక్కి జరక్క చురుగ్గ 

కొలిక్కి త్వరగా వస్తాదే

ఇది వయస్సు విపత్తు 

ఒకింత తెగించి ఉంటే మేలే

విధి తరించి తలొంచి 

కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే



 

4, డిసెంబర్ 2021, శనివారం

కీలుగుర్రమెక్కాడే కిందా మీదా పడ్డాడే పాట లిరిక్స్ - Keelugurramekkade KIndhaa Meedha Paddade Song Lyrics in Telugu - Middle Class Melodies (2020) Telugu Songs Lyrics










చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

సంగీతం : స్వీకార్ అగస్తి

సాహిత్యం : సానాపతి భరధ్వాజ పాత్రుడు

గానం : అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి

రమ్య బెహరా 

 


కీలుగుర్రమెక్కాడే కిందా మీదా పడ్డాడే

రాకుమారి కావాలన్నాడే

ఊబిలోకి దూకాడే ఊత గట్రా లేనోడే

ఊరినల్లా ఏలాలన్నాడే

గాలిగాడు తీరే మారి దారిలోకి వచ్చాడే

యావ మీద యాపారాన్నే పెట్టాడే

ఆరు నూరు అయ్యేదాకా అవలించానన్నాడే

ఆగలేక సాగేలాగే ఉన్నాడే

హే స్వారి చెయ్ రా కాలం మీద

 

సీకుసింతలున్నోడే సున్నా కన్నా సిన్నోడే

సిన్న సూపు సూడద్దన్నాడే

జీవితాన్ని పిల్లోడే పట్టాలెక్కించేసాడే

మైలు రాయి దాటించేసాడే

 

నోటి నీరు ఊరే ఊరే వంట ఈడు సేత్తాడే

తిన్నవాడు ఆహాలోకంసూత్తడే

నోటు మీద గాంధీ తాతే

నవ్వుకుంటూ వచ్చాడే

నవ్వుకుంట గల్లాపెట్టి సెరాడే

హే అడ్డే నీకు లేదియ్యల

 

నీకై వీచే పిల్ల గాలి ఈవేళ 

శ్వాసల్లే చేరిందా ఎదలో

నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ

హాయల్లే మారిందా మదిలో

సడి లేని జడివాన 

సరదాగా కురిసిందా

మనసారా తడిలోన

పొడి ప్రాణం తడిసిందా

గుండెల్లో ఉండే ప్రేమ

కళ్ళల్లో చేరిందమ్మా

చూపుల్లో ఉండే ప్రేమ దాగేనా

దాచాలన్న కుదరదు సుమా

 

అసలొకమాటైనా ఎవరితో అనకుండా

అలిగెళ్ళిపోయింది దూరమెందుకో

అంతులేని సంతోషం గంతులేసే

ఈ నిమిషం ఇద్దరొక్కటయ్యేరోయ్ 

ఇపుడే ఇపుడే

ఏ బాధ బంది లేదియ్యాలా

 

ఉంది నేడు బాగానే నిన్నా మొన్నా లాగానే

రేపు కూడా ఉంటాదంటావా

గడ్డు రోజులొస్తేనే కష్టం చుట్టం అయితేనే

మార్పు నీలో వస్తాదంటావా

ఈతి బాధలొచ్చాయంటూ 

బోరు బోరుమంటావా

వద్దు వద్దు అంటే నువ్వే ఇంటావా

ఓడ లేని రేవే నీవై బోసి పోయి ఉంటావా

ఓడిపోని వారే లేరోయ్ చూస్తావా

ఏ సాయం చేసే కాలం రాదా



 

6, నవంబర్ 2021, శనివారం

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే పాట లిరిక్స్ - Sandalle Sandalle Sankranthi Song Lyrics in Telugu - Sreekaaram (2021) Telugu Songs Lyrics










చిత్రం : శ్రీకారం (2021)

సంగీతం : మిక్కీ జె మేయర్  

సాహిత్యం : సానాపతి భరధ్వాజ పాత్రుడు

గానం : అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు


 

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే

 

మన ఊరితో సమయాన్నిలా 

గడిపేయడం ఒక సరదా రా

మనవారితో కలిసుండడం 

ఒక వరమేరా ఆ…

నను మరువని చూపులెన్నెన్నో

నను నడిపిన దారులెనెన్నో

నను మలచిన ఊరు 

ఎన్నెన్నో గురుతులనిచ్చినదే

 

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే

 

ముగ్గు మీద కాలు వెయ్యగానే 

రయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల

ముక్కుమీదకొచ్చే కోపం

భోగి మంట ముందు నిల్చోనుంది చల్లగాలి

ఒంటినే వెచ్చగా తాకుతోంది

తంబూరలతో చిడత పాడేనంటా

గంగిరెద్దులాటలో డోలు సన్నాయంటా

పెద్ద పండగొచ్చేనోయంటూ ముస్తాబు 

అయింది చూడరా ఊరు ఇచ్చట

ఇంటి గడప ఉంది స్వాగతించడానికి

వీధి అరుగు ఉంది మాట కలపడానికి

రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికీ.. 

ఊరు ఉంది చింత దేనికి

 

మన ఊరితో సమయాన్నిలా 

గడిపేయడం ఒక సరదా రా

మనవారితో కలిసుండడం 

ఒక వరమేరా ఓ…

 

దెబ్బలాటలోనా ఓడిపోతే కోడిపుంజు 

పొయ్యి మీద కూరలాగా 

తాను మారి పోదా పాపం

మేడ మీద నుండి గాలిపటము 

నింగి దాకా దారం తూగగా ఎగురుతోంది 

ఎడ్లబండి పై ఎక్కి చిన్నా పెద్దా

గోల గోల చేయడం ఎంత బాగుందంట

రోజు మారి పోయిన గాని తగ్గేది లేదంట

అంతటా సంబరాలే

 

విందు భోజనాలు చేసి రావటానికి

నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి

అంతమందినొక్కసారి కలవడానికీ

చాలవంట మూడు రోజులు

 

మన ఊరితో సమయాన్నిలా 

గడిపేయడం ఒక సరదా రా

మనవారితో కలిసుండడం 

ఒక వరమేరా....ఆఆఆ..

మన ఊరితో సమయాన్నిలా 

గడిపేయడం ఒక సరదా రా

మనవారితో కలిసుండడం 

ఒక వరమేరా ఓ…

 

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే

సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే

అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే