శ్వేతా మోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్వేతా మోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2022, శనివారం

రంగులే రంగులే పాట లిరిక్స్ - Rangule Rangule Song Lyrics in Telugu - Rang De (2021) Telugu Songs Lyrics










చిత్రం : రంగ్ దే (2021)

సంగీతం : దేవీశ్రీప్రసాద్  

సాహిత్యం : శ్రీమణి  

గానం : శ్వేతా మోహన్ 


 

నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే

అవి నిన్ను చూసినప్పుడే

నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే

నువ్వు నన్ను చూసినప్పుడే

నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే

నీవెంటే నేనుంటే 

పాదాలకె పసుపు పుసిందే

 

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

కన్ను చూడనన్ని కొత్త రంగులే

 

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

కన్ను చూడనన్ని కొత్త రంగులే

 

ఓ నవ్వు నువ్వు విసిరావు

ఆ క్షణము రంగు తెలుపు

నా కాటుకిష్టం అన్నావో

ఆ పూట రంగు నలుపు

నీ చేతి స్పర్శే తాకిందో

నా ఒంటి రంగు చెంగావి

నీ మౌనమే ఓ ముల్లైతే

నా పలుకు రంగు గులాబీ

జగామాడే రంగేళి ఏడాదికోసారి

నాలో ఈ హోళిలే 

నిమిషానికోసారి నీ వల్లే

 

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

కన్ను చూడనన్ని కొత్త రంగులే

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

కన్ను చూడనన్ని కొత్త రంగులే

 

నువ్వు పలకరించే ప్రతిసారి

ఆ పులకరింతది ఏ రంగో

నీ మెప్పు పొందే ప్రతిసారి

నా గొప్పతనమది ఏ రంగో

నువు కోపగించె సమయంలో

నా బుజ్జగింపుది ఏ రంగో

నువ్వు విడిచి వెళ్లే వేళల్లో

నా ఏదన వేదనదే రంగో

హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే

నా మనసే నీ వల్లే 

వేవేలా రంగుల్ని వెదజల్లే

 

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

పేరులేనివెన్నో కొత్త రంగులే

 

రంగులే రంగులే

నువ్వు పక్కనుంటే రంగులే

రంగులే రంగులే

పేరులేనివెన్నో కొత్త రంగులే

 


 

4, జనవరి 2022, మంగళవారం

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే పాట లిరిక్స్ - Nuvvele Nuvvele Naa Pranam Nuvvele Song Lyrics in Telugu - Jaya Janaki Naayaka (2017) Telugu Songs Lyrics










చిత్రం : జయజానకీనాయకా (2017)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : చంద్రబోస్

గానం : శ్వేతా మోహన్

 


నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే 

 

నడవలేని చోటులోన

పూల బాట నువ్వేలే

నిదురలేని జీవితాన

జోల పాట నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం 

నువ్వేలే

 

మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే

రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే

బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే

కష్టాలెన్నున్నా అదృష్టం నువ్వేలే

అలసి ఉన్న గొంతులోన

మనసు మాట నువ్వేలే

అడవిలాంటి గుండెలోన

తులసికోట నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే

 

దైవాలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే

స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే

దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే

ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే

మధురమైన భాషలోన

మొదటి ప్రేమ నువ్వేలే

మరణమైన ఆశలోన

మరొక జన్మ నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే

 

నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే 

 


 

18, నవంబర్ 2021, గురువారం

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా పాట లిరిక్స్ - Chittemma Chittemma Kallallo Yentamma Telugu Song Lyrics - Kaala (2018) Telugu Songs Lyrics










చిత్రం : కాలా (2018)

సంగీతం : సంతోష్ నారాయణ్

సాహిత్యం : వనమాలి

గానం : అనంతు, శ్వేతా మోహన్



పువ్వల్లే నా ప్రేమ తేనూరునో

ఆ నింగి తేనేల్లు కురింపించునో

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా..


ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయం ఎంతైన అది మానిపోదా

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..


నా దేహమంతా నీ ప్రేమతావే

కాలాలు ఏమార్చెలే

ఎడమైన ప్రేమ తాకింది మంటై

దూరాలు పెరిగేనులే

నదిలాంటి ప్రేమే పయనాలు ఆపే

ఆ ఎండమావైనదే

కలలన్ని కరిగి చేజారగానే

కలతేమో బ్రతుకైనదే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయమెంతైన అది మానిపోదా


ఏ తీగ వీణా పలికించకుండా

రాగాలు వినిపించదే

శిశిరాన వాడే చిగురాకులాగా

నా ప్రేమ మోడైనదే

ఏ జాలి లేని విధిరాత కూడా

చేసింది ఈ గాయమే

ముడి వేయకుండా

ముగిసింది నాడే

ఈ ప్రేమ అధ్యాయమే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయం ఎంతైన అది మానిపోదా

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..