టి.రాజేందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టి.రాజేందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2022, గురువారం

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా పాట లిరిక్స్ - Hrudayamane Kovelalo Ninu Kolichaane Song Lyrics in Telugu - Prema Saagaram (1983) Telugu Songs Lyrics









చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి.రాజేందర్

సాహిత్యం : రాజశ్రీ

గానం :  రమేశ్ 





హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...




దేవత నీవని తలచీ...  కవితను నేను రచించా

దేవత నీవని తలచీ...  కవితను నేను రచించా

అనురాగాలే మలిచీ...  ధ్యానం చేసి పిలిచా

 

నీ చెవికది చేరకపోతే...  నీ చెవికది చేరక పోతే

జీవితమే మాయని చింతే...  జీవితమే మాయని చింతే

 

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...




నా ప్రేమకు నీరే సాక్షం...  నీ కోపము నిప్పుల సాక్షం

నా ప్రేమకు నీరే సాక్షం...  నీ కోపము నిప్పుల సాక్షం

నీటికి నిప్పులు ఆరూ...  నీ కోపం ఎప్పుడు తీరు?

 

నీ ప్రేమే కరువైపోతే.... నీ ప్రేమే కరువైపోతే

నే లోకము విడిచిపోతా...  లోకము విడిచిపోతా 


హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...



 

నీ తలపే మైకం నీ వలపే లోకం పాట లిరిక్స్ - Nee Thalape Maikam Nee Valape Lokam Song Lyrics in Telugu - Prema Saagaram (2021) Telugu Songs Lyrics









చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి.రాజేందర్

సాహిత్యం :  రాజశ్రీ

గానం : యస్.జానకి



ఏయ్ ఏయ్ లలలలలల...

ఏయ్ ఏయ్ లలలలలల

హే లాలల హే లలల

లలల లలల లలల లా....


నీ తలపే మైకం.. నీ వలపే లోకం

నీ తలపే మైకం.. నీ వలపే లోకం

 

కరువాయే నా నిద్దర.. కావాలి నీ ముద్దర

కరువాయే నా నిద్దర.. కావాలి నీ ముద్దర


హాహహా హాహహాహా...

హేహేహే హేహెహేహే..

ఆహా ఆహా ఆహా....


నీ తలపే మైకం.. నీ వలపే లోకం

ఆహా ఆహా ఆహా ఆహా 




కలనైనా నిన్నే తలచి.. కసితీరా నిన్నే వలచి

నీ కోసం ఎదురు చూసి.. నా కళ్ళే కాయలు కాసి

విరహాన నేనూ..ఊ.. వేగినానూ...ఊ..

విరహాన నేనూ..ఊ.. వేగినానూ...ఊ..


నీ చూపుల్లో.. నన్ను చిక్కుకోని

నీ గుండెల్లో.. నన్ను చేరుకోని

ముద్దులే సాగనీ... హద్దులే దాటనీ..

జతగా కలిసే.. సరదా చేసే.. హే.. చూడనీ


నీ తలపే మైకం... నీ వలపే లోకం



పరువం పానుపు వేసి.. దాహాలన్ని తీరి

అందం కానుక చేసి.. నీలో నేను చేరి

 

గడుసు వయసూ... చిలిపి సొగసూ

గడుసు వయసూ... చిలిపి సొగసూ 

 

ఇక ఏనాడు ఒకటవ్వాలి

ఇక నీ తోడు నాకు కావాలి

అందుకే.. చిన్నది అందుకో..అన్నది

ఎదనే పరచి..నీకై నిలిచి.. హే.. ఉన్నదీ

 

నీ తలపే మైకం... నీ వలపే లోకం

కరువాయే నా నిద్దర.. కావాలి నీ ముద్దర

కరువాయే నా నిద్దర.. కావాలి నీ ముద్దర


హాహహా హాహహాహా...

హేహేహే హేహెహేహే..




 

నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే... పాట లిరిక్స్ - Neelo Naalo Mohaalenno Moggalesthe Song Lyrics in Telugu Prema Saagaram (1983) Telugu Songs Lyrics









చిత్రం :  ప్రేమసాగరం (1983)
సంగీతం : టి.రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి




ధీంతణక ధీం...  ధీంతణక ధీం...

ధీంతణక ధీం... ధీంతణక ధీం...

షబరిబా.. షబరిబా

తత్తరతా.. తరెత్తరా.. 


నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...

నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...

నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...

నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...ఏ..ఏ

 

పొంగదా యవ్వనం... చిందదా తొలిసుఖం

యవ్వనం.. తొలిసుఖం.. ఈ క్షణం.. చెరి సగం

పొంగదా యవ్వనం... చిందదా తొలిసుఖం.. హా



అపురూపాల చెలి రూపము... హా.. హా..
అనురాగానికే శిల్పము.. హా.. హా
దేవలోక అమృతాలు ఒలికించు అధరం...
పాల బుగ్గ వెన్నెల్లో వర్షించు సమయం...

 

బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు..
ఇక ఎవరికైన అవుతుంది గుండెగుబులు
బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు..
ఇక ఎవరికైన అవుతుంది గుండెగుబులు


పొంగదా.. హా..  యవ్వనం... హా.. చిందదా తొలిసుఖం
యవ్వనం.. తొలిసుఖం.. ఈ క్షణం.. చెరి సగం


ధీంతణక ధీం...  ధీంతణక ధీం...

ధీంతణక ధీం... ధీంతణక ధీం... 


పాల పొంగంటి నా పరువమూ.. హే.. హేహే

రగిలి రాసింది రసకావ్యాము.. హా.. హహహా..

 

ఆడుతుంది కోడెనాగు చిన్నారి నీ చేతిలో

చిన్నవాడి చూపు కూడా చురుక్కుమంది ఈ వేడిలో


నిద్దర ఎరగని తలపులివి... తొలి ముద్దుల పండగ కోరినవి
నిద్దర ఎరగని తలపులివి... తొలి ముద్దుల పండగ కోరినవి

నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...ఏ..ఏ
పొంగదా యవ్వనం... చిందదా తొలిసుఖం
లలలా.. లలలా.. లలలా.. లలలా... 


 

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ పాట లిరిక్స్ - Andaalolike Sundari Raathiri Kalalo Vacchenoo Song Lyrics in Telugu - Prema Saagaram (1983) Telugu Songs Lyrics










చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం : టి.రాజేందర్

సాహిత్యం : రాజశ్రీ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ

 


ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

 

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి

నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

 

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

 

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది

మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది

ముద్దు మోములో కొటి మోహములు 

చిలికేను నా చెలి కనులే

సింధు భైరవిని చిలక పలుకుల 

దోర పెదవులే పలికే..ఏ..ఏ...

ప్రేమ యువకుల పాలిట ఒక వరం

అది వలచిన మనసుల అభినయం

ప్రేమ యువకుల పాలిట ఒక వరం

అది వలచిన మనసుల అభినయం

లాలాలల లాలాలల

లాలాలల లాలాలల

 

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

 

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే

మరులు విరిసి పలకరించె మనసు

కలలు మురిసి పులకరించె వయసు

కన్నులు కులికెను కవితలు పలికెను

పాదము కదిలెను భావము తెలిసెను

అదే కదా అనుక్షణం చెరగని

సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..

 

మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే

నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా

అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం

మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి 

చెలి స్నేహం ఆ..ఆ..

పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ

పలవరింతలు రేపెను కోటి ..ఆమె కెవరు లేరిక సాటి

లాలాలల లాలాలల

లాలాలల లాలాలల

 

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను

 

ఆఆఆ..రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి

నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ

పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ.. 



 

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి పాట లిరిక్స్ - Chakkanaina Oo Chirugaali Okkamaata Vinipovaali Song Lyrics in Telugu - Prema Saagaram (1983) Telugu Songs Lyrics









చిత్రం : ప్రేమసాగరం (1983)

సంగీతం : టి.రాజేందర్

సాహిత్యం : రాజశ్రీ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

 


చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

 

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం...

 

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

 

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం...

 

మూసారు గుడిలోని తలుపులను

ఆపారు గుండెల్లో పూజలను

దారిలేదు చూడాలంటే దేవతను

వీలుకాదు చెప్పాలంటే వేదనను

కలతైపోయే నా హృదయం 

కరువైపోయే ఆనందం

అనురాగమీవేళ అయిపోయే చెరసాల

అనురాగమీవేళ అయిపోయే చెరసాల

అయిపోయె చెరసాల

 

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... నా ప్రేమ సందేశం..

నా ప్రేమ రాగాలు కలలాయె

కన్నీటి కథలన్ని బరువాయే

మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో

మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో

వేదనలేల ఈ సమయం

వెలుతురు నీదే రేపుదయం

శోధనలు ఆగేను శోకములు తీరేను

శోధనలు ఆగేను శోకములు తీరేను

శోకములు తీరేను..

 

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... నా ప్రేమ సందేశం...

 

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

 

ఉషా దూరమైన నేను.. ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం..

ఈ  నా ప్రేమ సందేశం



నామం పెట్టు నామం పెట్టు కాలేజికి పాట లిరిక్స్ - Naamam Pettu Naamam Pettu Song Lyrics in Telugu - Prema Saagaram (1983) Telugu Songs Lyrics







చిత్రం : ప్రేమసాగరం (1983)

సంగీతం : టి.రాజేందర్

సాహిత్యం : రాజశ్రీ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


 

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

 

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

చిందెయ్యని చిందెయ్యని నీ అందం

అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం

అయ్యో చిందెయ్యని చిందెయ్యని నీ అందం

అమ్మ ఊరేగని ఊరేగని యవ్వనం

అహ అహ అహ

 

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

 

ఆ..తకిట తకిట తా

అరె తళాంగు తకిట తా

అరె తరికిడితరికిడితరికిడి తా

అరె తకిడితకిడితకిడితకిడి తా

 

అయ్యయో.. అయ్యయో.. అయ్యయో.. అయ్యయో....

జీనతమనులాగ చీర సగము కట్టి

జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి

జీనతమనులాగ చీర సగము కట్టి

జయమాలిని లాగ.. భలే ఫోజు పెట్టి

 

ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు

ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు

మంగళవారం పసుపు.. బుధవారం తెలుపు

నువ్వు వేసుకొచ్చే ఓణీలన్ని చూశామే

నీ బాడీలకు దాసోహమే చేసామే.. ఎహే ఎహే ఎహే

 

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

 

అహ ఉం అహ ఉం అహ ఉం. అహ హుం...

 

అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల

ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు

అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల

ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు

 

పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి

పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి

షోకులెన్నో చేసి.. వచ్చాడట పాపం

మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు

పచ్చి కారం కూడా కొడతారమ్మ కళ్ళలో

ఒహొ ఒహొ ఒహొ

 

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి

చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

 

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

అల్లరి కళ్ళ పడుచు పిల్ల

అమ్మ చిందెయ్యని చిందెయ్యని నీ అందం

ఊరేగని ఊరేగని యవ్వనం

అరె చిందెయ్యని చిందెయ్యని నీ అందం

అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం

అహ అహ అహహ