జస్ ప్రీత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జస్ ప్రీత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, డిసెంబర్ 2021, గురువారం

జల జల జలపాతం నువ్వు పాట లిరిక్స్ - Jala Jala Jalapatham Nuvvu Song Lyrics in Telugu - Uppena (2021) Telugu Songs Lyrics








చిత్రం : ఉప్పెన (2021)

సంగీతం : దేవీశ్రీప్రసాద్ 

సాహిత్యం : శ్రీమణి  

గానం : జస్ ప్రీత్, శ్రేయా ఘోషల్


 

జల జల జలపాతం నువ్వు

సెల సెల సెలయేరుని నేను

సల సల నువు తాకితే నన్ను

పొంగే వరదై పోతాను

 

చలి చలి గాలివి నువ్వు

చిరు చిరు చిరుఅలనే నేను

చెర చెర నువు అల్లితే నన్ను

ఎగసే కెరటాన్నవుతాను

 

హే... మన జంటవైపు 

జాబిలమ్మ తొంగి చూసెనే

హే... ఇటు చూడకంటూ

మబ్బు రెమ్మ దాన్ని మూసెనే

ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే  

 

జల జల జలపాతం నువ్వు

సెల సెల సెలయేరుని నేను

సల సల నువు తాకితే నన్ను

పొంగే వరదై పోతాను

 

చలి చలి చలిగాలివి నువ్వు

చిరు చిరు చిరు అలనే నేను

చెర చెర నువు అల్లితే నన్ను

ఎగసే కెరటాన్నవుతాను

 

సముద్రమంత ప్రేమ

ముత్యమంత మనసు

ఎలాగ దాగి ఉంటుందీ లోపలా

ఆకాశమంత ప్రణయం

చుక్కలాంటి హృదయం

ఎలాగ బైటపడుతోంది ఈవేళా

నడి ఎడారి లాంటి ప్రాణం

తడి మేఘానితో ప్రయాణం

ఇక నా నుంచి నిన్నూ

నీ నుంచి నన్నూ 

తెంచలేదు లోకం  

 

జల జల జలపాతం నువ్వు

సెల సెల సెలయేరుని నేను

సల సల నువు తాకితే నన్ను

పొంగే వరదై పోతాను

 

ఇలాంటి తీపి రోజు

రాదు రాదు రోజూ

ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం

ఇలాంటి వాన జల్లు

తడపదంట ఒళ్లు

ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం

ఎప్పుడూ లేనిదీ ఏకాంతం

ఏక్కడా లేని ఏదో ప్రశాంతం

మరి నాలోన నువ్వు నీలోన నేను 

మనకు మనమే సొంతం 

 

జల జల జలపాతం నువ్వు

సెల సెల సెలయేరుని నేను

సల సల నువు తాకితే నన్ను

పొంగే వరదై పోతాను

 

చలి చలి చలి గాలివి నువ్వు

చిరు చిరు చిరు అలనే నేను

చెర చెర నువు అల్లితే నన్ను

ఎగసే కెరటాన్నవుతాను