ఈ సినిమాని మా నాన్నగారు చాల ఇష్టపడతారు ఈటీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ అయినా దీని గురించి మాట్లాడతారు.
ఈ రోజు మళ్లీ ఈ చిత్రం బుల్లితెరలో ప్రసారం చేసారు ,
అప్పుడే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.
ఈ పాటకు ముందు వచ్చే మాటలు
మా నాన్నగారికి కళ్లనిండా నీళ్లు తెప్పించాయి అంటా,
కేవలం ఈ పాట కోసమే మూడుసార్లు
ఈ చిత్రాన్ని చూసానని చెప్పారు, వ్యక్తిగతంగా కూడా
ఈ సినిమా, మరియు ఈ పాట నాకు చాల ఇష్టం.
మా నాన్నగారి కోసం
ఈరోజు ఈ పాటని మన నేను నా పాట లో
ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : సుస్వాగతం (1997)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి