17, జూన్ 2020, బుధవారం

ఎవరినిరా ప్రేమించావు పాట లిరిక్స్ - Evarinira Preminchavu Telugu Song Lyrics - Varam (2004) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : వరం (2004)
సాహిత్యం :
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : యం.యం.కీరవాణి

ఎవరినిరా .... ప్రేమించావు
తన తోడునా తన నీడనా
తన చూపునా తన రూపునా

అశ పెడుతున్నా నవ్వునా
ఆమె చూపించు చొరవనా
గొంతు విడి రాని మాటనా
గుండె విడిపోని బరువునా
అందుకోలేని నింగినా
నింగిలో ఉన్న తారనా
ఎండమావినా.....

ఎవరినిరా .... ప్రేమించావ్
తన తోడునా తన నీడనా
తన చూపునా తన రూపునా

నీలోన నువ్వే ఏవెవో ఊహించుకున్నావు
నీ కన్నుల్లో కదిలే కలలే నిజమని

మనస్సులోనే మౌనంగా కధ అల్లుకున్నావు
ఆ కధా స్వరూపం నీలో ఉందని

కల మేఘాలే కరిగి కన్నీరై పోతుంటే
మిగిలి పోయవు ప్రశ్నలా
కాలిపోతున్నా ఆశలా
ప్రాణమే లేని రాయిలా
గుండె కోతలా

ఎవరినిరా .... ప్రేమించావు
తన తోడునా తన నీడనా
తన చూపునా తన రూపునా

ప్రతిక్షణం నీ హృదయంలో లిఖించుకున్నావు
ఆ క్షణాలే ముల్లై గుచ్చే దెరుగకా
ప్రపంచమంతా తన తోనే ఉందనుకున్నావు
ఈ ప్రమాదమన్నది ముందే తెలియక
మనసు రగిలిపోతుంటే వెలుగు వెక్కిరిస్తుంటే
చీకటయిపోయే లోకమే నీకు మిగిలింది శోకమే
ఎగిసిపడుతుంటే కాలమే శ్వాస భారమై

ఎవరినిరా .... ప్రేమించావు
తన తోడునా తన నీడనా
తన చూపునా తన రూపునా

ఎవరినిరా .... ప్రేమించావు
తన తోడునా తన నీడనా
తన చూపునా తన రూపునా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి