28, జూన్ 2020, ఆదివారం

సిత్రమైనా భూమి సేసినాడ సామి పాట లిరిక్స్ - Sithramaina Bhoomi Song Lyrics in Telugu - Aakasam Nee Haddura (2020) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి














చిత్రం : ఆకాశం నీ హద్దురా (2020)
సాహిత్యం : రాకేందు మౌళి
సంగీతం : జీవి.ప్రకాష్ కుమార్
గానం : జీవి.ప్రకాష్ కూమార్, రేవంత్







సిత్రమైనా భూమి సేసినాడ సామి
మనుషులాడే ఆటే సూడు
ఆటే సూడు ఆటే సూడు ఆటే సూడు

ఆటే ఆట ఆడే ఆట ఆట ఆట ఆట

బుజ్జి మట్టి బంతి మీద
మనిషి వింత ఆటే సూడు

రెప్పవాలి రాలిపోతే
పాడే మనకు వచ్చే తోడు

సక్కగ ఎసుకోర కార సారా సుక్క
సుక్కల్లో కెక్కినోడి ఖాతాలో ఈ లెక్క

రాజు పేద హాయి బాధ బేదాలేవి లేవు
నూకలింక సెల్లిపోతే అందరిదోక్క సావు

రాజు పేద హాయి బాధ బేదాలేవి లేవు
నూకలింక సెల్లిపోతే అందరిదోక్క సావు


కోతి నుంచి మనిషైనా జాతి మారలేదు
రాతే సూడు నీతే సూడు
కోతే సూడు కోతే సూడు
కోతి జాతి కోతే నీతే
కోతే పాతే ఆడు

నీది నాది అన్న తీపి పోదు కదా పూడ్సేలోపు
సచ్చినోడైనా లేపి ఆడిస్తున్నా డబ్బే తోపు

మందు బాబులంత గంతులేస్తే లుంగీలూడే
ఆడాల్ల ఏడుపులే ఎలుగెత్తి పాడే

సుట్టాలేందరున్నా సీవరి 
నీ తోడెవడు రారులే
మేడ మీడ మిద్దెలెన్నున్నా
నీ సోటే ఆరు అడుగులే

సుట్టాలేందరున్నా సీవరి
నీ తోడెవడు రారులే
మేడ మీడ మిద్దెలెన్నున్నా
నీ సోటే ఆరు అడుగులే

కులం నాది తక్కువైతే
కులం నాది తక్కువైతే

రక్తం రంగు మారుతుందా ?
ఒంట్లో రక్తం రంగు మారుతుందా  ?

అరే నీ కులము ఎక్కువైతే .......
అరే నీ కులము ఎక్కువైతే .......

కొమ్మలుంటాయార ? ఉంటాయార ? 
కొమ్ములుంటే కొమ్ములుంటే
కొమ్ము కొమ్ము కొమ్ములుంటే
కుమ్మి కుమ్మి ఇరిసేయ్

కులాన తక్కువైతే ఒంట్లో బురద పారుతుందా
నీ కులం ఎక్కువైతే రక్తం రంగు మారుతుందా

కాయ కష్టాన్ని నమ్ముకున్న కులం మాది
మాయ మతలబులు నేర్చుకున్న కులం మీది

నిప్పెట్టెటి మతము ఇక కప్పెట్టాలి మనము
నిప్పెట్టెటి మతము ఇక కప్పెట్టాలి మనము

కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు
కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి