ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : బసంతి (2014)
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : మణిశర్మ
గానం : పవన్
అక్కడ లేను ఇక్కడ లేను
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : మణిశర్మ
గానం : పవన్
అక్కడ లేను ఇక్కడ లేను
ఎక్కడికక్కడ ఏమయ్యాను
ఇప్పుడు లేను అప్పుడు లేను
ఇప్పుడు లేను అప్పుడు లేను
ఇప్పటికిప్పుడు ఏమయ్యాను
ఎపుడు ఉండే చోట లేను
ఎవరు లేని చోట లేను
ఇక్కడికిక్కడ ఇప్పటికిప్పుడు
ఏమైపోతున్నాను
పారిపోతున్నా.....
బంగారు లోకం లోకి వాలిపోతున్నా
నాలోనే నే లేనా ఆఅ
పారిపోతున్నా.....
బంగారు లోకం లోకి వాలిపోతున్నా
నాలోనే నే లేనా ఆఅ
నేనా ఇంకేవరోనా
నీ నడుములా నీ మనసులా
కనిపించనంటున్ననాన
నా పేరులా నా తీరులా
నా పేరులా నా తీరులా
వినిపించనంటున్ననాన
నేనంటే నాకు పడక పారిపోతున్నా
ఆఅ
నాలోనే నే లేనా ఆఅ
నేనా ఇంకేవరోనా
చేసే పనిలో తికమక
ఏం చేస్తున్నానో తెలియక
నీకోసం అన్ని తప్పుకు పోతున్నా
నేనెదురైనా తల తిప్పుకు పోతున్నా
అరికాళ్ళతొ చిటికెలు వేసినా
అరచేతులతో నడిచేసినా
తలకిందుల తేడా తేలదు ఏమైనా
నలుగురిలో నవ్వుల పాలై పోతున్నా
నా బాల్యంనైన ఇంతలా చిందేసానా
నా ప్రాణన్నైన ఇంతలా ప్రేమించానా
ఏ మాట తేల్చలేక పారిపోతున్నా ఆఅ
నాలోనే నే లేనా ఆఅ
నేనా ఇంకేవరోనా
నలుదిక్కులనే కలిపినా
నా చిరునామా దొరుకునా
నువ్వెక్కడ ఉన్నా ఇట్టే కనుగొన్నా
నా జాడను మాత్రం జల్లెడ వేస్తున్నా
నీ పేరే పలికాననా
చీమకు కూడా చులకనా
నేనేమంటున్నా అర్ధం ప్రేమేనా
ఇకపై నాలోన స్వార్ధం నువ్వేనా
నీకోసం చార్ మినారులే ఏకం కావా
నువ్వుంటే ప్రేమసీదులే గుళ్ళైపొవా
ఈ వింతలు చూడలేక పారిపోతున్నా
ఆఅఅ
నాలోనే నే లేనా ఆఅ
నేనా ఇంకేవరోనా
నాలోనే నే లేనా ఆఅ
నేనా ఇంకేవరోనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి