2, జూన్ 2020, మంగళవారం

ఎవ్వరితో చెప్పను ఎక్కడని వెతకను పాట లిరిక్స్ - Evvaritho Cheppanu Ekkadani Vethakanu Telugu Song Lyrics - Anaamika (2014) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : అనామిక (2014)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి 
గానం : సునీత

ఎవ్వరితో చెప్పను ఎక్కడని వెతకను
మనసు ఏదని
నిను చేరే ఆశతో ఎదురీదే శ్వాసతో
గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో చెప్పను

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నిను మరువదే తలపు వెనుదిరగదే
చూపు కనబడనిదే రేపు
నమ్మడేమేలా ..... నువ్వు కలవేనని
కంటపడవా..... ఉన్నానని

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నను తరుముతు సమయం
నిను తడుముతు హృదయం

ఎటు నడపను పయనం
ఎంతవరకు....... ఇలా కొనసాగాను
ఏ మలుపులో..... నిను చూడాను


క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి