30, మార్చి 2022, బుధవారం

ప్రియా ప్రియా మధురం పాట లిరిక్స్ - Priya Priya Madhuram Song Lyrics in Telugu - Sri Krishna Satya (1971) Telugu Songs Lyrics






















చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, యస్.జానకి










ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
పిల్లనగ్రోవి పిల్లవాయువు
పిల్లనగ్రోవి పిల్లవాయువు
భలే భలే మధురం..అంతకు మించీ
ప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం

 

ఇన్నీ ఉన్నా సరసిజలోచన..
సరసన ఉంటేనె మధురాం
మనసిచ్చిన ఆ..అలివేణి
అధరం..మరీ మరీ మధురం
ప్రియా ప్రియా మధురం

ఏనాటి నా పూజాఫలమో
ఏజన్మలో పొందిన వరమో
అందరుకోరే శ్యామసుందరుడే
అందరుకోరే శ్యామసుందరుడే
నాపొందు కోరుట మధురం

 
సత్యా కృష్ణుల సరసజీవనం
సత్యా కృష్ణుల సరసజీవనం
నిత్యం నిత్యం మధురం..
ప్రతి నిత్యం అతి మధురం
ప్రతి నిత్యం అతి మధురం
ప్రియా ప్రియా మధురం

సవతులెందరున్నా..ఆ ఆ ఆ
సవతులెందరున్నా కృష్ణయ్యా
సత్యను వలచుట మధురం
భక్తికి రక్తికి లొంగని స్వామిని
కొంగున ముడుచుట మధురం
నా కడకొంగున ముడుచుట మధురం

  
ఈ భామామణి ఏమి పలికినా
ఈ భామామణి ఏమి పలికినా
ఔననుటే మధురం  
ఈ చెలి పలుకుల పర్యవసానం
ఇంకా ఇంకా..మధురం..
ప్రియా ప్రియా మధురం

నను దైవముగా నమ్మిన దానవు 
కడ కొంగున నను ముడువని దానవు 
చల్లని ఓ సతీ జాంబవతీ..ఈఈ..
చల్లని ఓ సతీ జాంబవతీ
నీ సాహచర్యమే మధురం 

ప్రాణ నాథా నీ పాద సేవలో 
పరవశించుట మధురం 
తరియించుటే మధురాతి మధురం

జయహే నవ నీల మేఘ శ్యామా పాట లిరిక్స్ - Jayahe Nava Neela Megha Shyama Song Lyrics in Telugu - Sri Krishna Vijayam (1971) Telugu Songs Lyrics





















చిత్రం : శ్రీకృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు  
సాహిత్యం : దాశరథి 
గానం : ఘంటసాల






జయహే నవనీలమేఘశ్యామా 
వన మాలికాభిరామా 
జయహే నవనీలమేఘశ్యామా 
వనమాలికాభిరామా 
జయహే నవనీలమేఘశ్యామా 
వనమాలికాభిరామా 
నీ గానమ్ములో ఈ లోకమ్ములే పులకించు 
దేవ దేవా..ఆఆ..పులకించు దేవ దేవా..ఆఆ 

జయహే నవ నీల మేఘ శ్యామా 
వన మాలికాభిరామా 

వేదాల కొసలందు వెలుగొందు స్వామీ
రేపల్లె వాడలో వెలసినావేమీ
మానవుని దేవునిగ మలచనే గాదా..ఆఆఆఆఆ 
మానవుని దేవునిగ..మలచనేగాదా
అవులే..సరేలే..భలే లీలలే  
  
జయహే నవ నీల మేఘ శ్యామా
వన మాలికాభిరామా 

ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి
ఎన్నెన్నో రూపల ఏతెంతువీవు 
ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి
ఎన్నెన్నో రూపాల ఏతెంతువీవు 
వేడిన వారిని విడనాడబోవు
నిజంనిజం ముమ్మాటికిది నిజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జయహే నవ నీల మేఘ శ్యామా
వన మాలికాభిరామా 

మధురం మధురం..అధరం మధురం
అధరం సోకిన..వేణువు మధురం
మధురం మధురం..అధరం మధురం
అధరం సోకిన..వేణువు మధురం
నామం మధురం..రూపం మధురం
పిలుపే మధురం..తలపే మధురం..
నీవే..ఏ..మధురం







గోపీ మునిజన హృదయ విహారీ పాట లిరిక్స్ - Gopi Munijana Hrudaya Vihaari Song Lyrics in Telugu - Sri Krishna Satya (1971) Telugu Songs Lyrics





















చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.జానకి







గోపీ మునిజన 
హృదయ విహారీ
గోవర్థన గిరిధారి హరే
గోవర్థన గిరిధారి హరే
గోవర్ధన గిరిధారీ..

సర్వ వేదముల సారము నీవే 
సర్వ వేదముల సారము నీవే 
జపతపమ్ముల రూపము నీవే 
పరమ పదమునకు మార్గమునీవే
పరమ పదమునకు మార్గమునీవే
భవబంధముక్తికి మూలమునీవే
 
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ

ఏనాడు ధర్మము గతి తప్పునో
ఆనాడే నీవవతరింతువు 
ఏనాడు ధర్మము గతి తప్పునో
ఆనాడే నీవవతరింతువు 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 
పరమావధియైన పరమాత్మా

గోవర్థన గిరిధారి హరే 
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ






చూడుమదే చెలియా..కనులా పాట లిరిక్స్ - Choodumadhe Cheliya Kanula Song Lyrics in Telugu - Vipranarayana (1954) Telugu Songs Lyrics























చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ.ఎం.రాజా








చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను మలయానిలముల 
సోలెను యమునా...

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
 
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా...ఆఆ.అ.అ.ఆఅ...
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవ కేళీ నటనా..
 
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..









యా రమితా వనమాలినా పాట లిరిక్స్ - Yaa Ramitha Vanamalina Song Lyrics in Telugu - Bhakta Jayadeva (1961) Telugu Songs Lyrics






















చిత్రం : భక్తజయదేవ (1961)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : జయదేవుడు 
గానం : ఘంటసాల, పి.సుశీల 















యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 
సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 

సకల భువనజన వర తరుణేన 
సకల భువనజన వర తరుణేన 
వహతి న సా రుజ మతి కరుణేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా

అనిల తరళ కువలయ నయనేన
తపతి న సా కిసలయ శయనేన
యా రమితా వనమాలినా 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా
 
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

కృష్ణా యదుభూషణా పాట లిరిక్స్ - Krishna Yadhubhooshana Song Lyrics in Telugu - Sri Krishna Pandaveeyam (1965) Telugu Songs Lyrics























చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1965)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సముద్రాల సీనియర్ 
గానం : పి.బి.శ్రీనివాస్ 










కృష్ణా యదుభూషణా
శ్రీ కృష్ణా యదుభూషణా
గోవిందా ముకుందా హే పావనా 
కృష్ణా యదుభూషణా

దీనుల పాలిటి దైవము నీవట 
అమరులనేలెడి అయ్యవు నీవట 
దీనుల పాలిటి దైవము నీవట 
అమరులనేలెడి అయ్యవు నీవట
భక్త కోటికి చింతామణివట... ఆఆ..ఆఅ..ఆ
భక్త కోటికి చింతామణివట
నిను నెరనమ్మిన లోటే రాదట 

కృష్ణా యదుభూషణా

అఖిలమునెరిగిన అంతర్యామికి 
వివరించే పని లేదుగదా 
అఖిలమునెరిగిన అంతర్యామికి 
వివరించే పని లేదుగదా
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మనీ
కృష్ణా..ఆఆఅ..ఆఅ..ఆఆఅ... 
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మనీ
రమ్మని పిలచుట నాభాగ్యమెగా 

కృష్ణా యదుభూషణా
గోవిందా ముకుందా హే పావనా 
కృష్ణా యదుభూషణా
హే కృష్ణా యదుభూషణా