31, డిసెంబర్ 2021, శుక్రవారం

తెల్లారింది లెగండో కొక్కొరోక్కో పాట లిరిక్స్ - Tellarindi Legando Kokkorokko Song Lyrics in Telugu - Kallu (1988) Telugu Songs Lyrics




















చిత్రం : కళ్ళు (1988)

సంగీతం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం  

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : సిరివెన్నెల సీతారామశాస్త్రి









తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


పాములాంటి చీకటి పడగ దించి పోయింది

భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి

చావు లాటి రాతిరి సూరు దాటి పోయింది

భయం నేదు భయం నేదు సాపలు ట్టేయండి

ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది

ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది

మూసుకున్న రెప్పలిరిసి సూపు లెగర నీయండి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


చురుకు తగ్గిపోయిందీ చందురుడి కంటికి

చులకనై పోయిందీ లోకం సీకటికి

కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం

ఎనక రెచ్చి పోయిందీ అల్లుకున్న పాపం

మసక బారి పోయిందా సూసేకన్ను

ముసురు కోదా మైకం మన్నూ మిన్ను

కాలం కట్టిన గంతలు దీసి

కాంతుల ఎల్లువ గంతులు ఏసి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం

ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం

కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ

ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ

చమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం

ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం

ఏకువ శత్తుల కత్తులు దూసి

రేతిరి మత్తును ముక్కలు సేసి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో

 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి