28, డిసెంబర్ 2021, మంగళవారం

కొమురం భీముడో కొమురం భీముడో పాట లిరిక్స్ - Komuram Bheemudo Komuram Bheemudo Song Lyrics in Telugu - RRR (2022) Telugu Songs Lyrics








చిత్రం : ఆర్.ఆర్.ఆర్ (2022)

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ 

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : కాల భైరవ



కొమురం భీముడో కొమురం భీముడో 

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో

కొమురం భీముడో కొమురం భీముడో రగ రాగ సూరీడై 

రగలాలి కొడుకో రగలాలీ కొడుకో 



కాల్మొక్త బాంచెనని ఒంగి తోగాల

కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో

జూలుము గద్దెకు తలను ఒంచితోగాల తుడుము తల్లీ

పేగున పెరగనట్టేరో పెరగనట్టేరో


కొమురం భీముడో కొమురం భీముడో 

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో


సెర్మ మొలిసే దెబ్బకు అబ్బంటోగాలా

సిలికే రక్తం చూసి చెదిరితోగాల 

గుబులేసి కన్నీరు ఒలికితోగాల 

భూతల్లి సనుబాలు తాగనట్టేరో తాగనట్టేరో


కొమురం భీముడో కొమురం భీముడో 

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో


కాలువై పారే నీ గుండె నెత్తురూ 

కాలువై పారే నీ గుండె నెత్తురూ 

నేలమ్మ నుదిటి బొట్టైతుంది సూడు

అమ్మ కాళ్ళ పారానైతుంది సూడు 

తల్లి పెదవుల నవ్వైమెరిసింది సూడు 


కొమురం భీముడో కొమురం భీముడో 

పుడమి తల్లికి జనమ అరన మిస్తివిరో


కొమురం భీముడో 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి