31, డిసెంబర్ 2021, శుక్రవారం

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక పాట లిరిక్స్ - Jaajimalli Thotalona Oosulaade Goruvanka Song Lyrics in Telugu - Ninu Choodaka Nenundalenu (2002) Telugu Songs Lyrics







చిత్రం : నిను చూడక నేనుండలేను (2002)

సాహిత్యం : కులశేఖర్

సంగీతం : ఇళయరాజా  

గానం : సాధన సర్గమ్ 



జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో 

జాజిమల్లీ తోటలోనా … 


జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో 

జాజిమల్లీ తోటలోనా


ఓ .. రోజూ చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా 

చెప్పలేనే ఎందుకో మరీ 

నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా 

అందుకోడే ఇంత ప్రేమనీ 


ఏ నీలిమేఘానితో రాయాలి నా ప్రేమనీ 

ఏ పూల రాగాలతో పంపాలి ఆ లేఖనీ 

మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే 


జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

జాజిమల్లీ తోటలోనా


ఆమ్మో బాబో అన్నా నువ్వే దారి అన్న 

చిన్న మాట గొంతు దాటేదే 

మాటే రాదంటున్నా దారి లేదంటున్నా 

గుండె చాటు ప్రేమ ఆగదే 


ఈ మొహలుయ్యాలలో ... నా ఆశ తీరేదెలా 

ఈ గాలి కౌగిళ్ళల్లో … నా మాట చేరేదెలా 

ఎవరైనా తెలపాలి మదిలోన బాధని 


జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో 

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి