29, డిసెంబర్ 2021, బుధవారం

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట లిరిక్స్ - Cheppalani Undi Gonthu Vippalani Undi Song Lyrics in Telugu - Rudraveena (1988) Telugu Songs Lyrics














చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో

  

 






ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం

మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం

కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది

దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది

మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైన

ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా

ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని

అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

 

 

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

 

గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 

 

 

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని

అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని

అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని

 

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

 

పాట బాట మారాలని చెప్పటమేనా నేరం

గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం

వసంతాల అందం విరబూసే ఆనందం

తేటి తేనె పాట పంచవన్నెల విరితోట

వసంతాల అందం విరబూసే ఆనందం

తేటి తేనె పాట పంచవన్నెల విరితోట

 

బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట

మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట

మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట

 

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

 

 

 

 

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం

ఏదీ మరి మిగతా కాలాలకు తాళం

నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు

కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు

మంచు వంచనకు మోడై గోడు పెట్టు వాడొకడు

వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం

అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం

అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల

 

కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా

నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం

కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం

 

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

 

 

 

 

అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం

నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం

ఎడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు

దిక్కు మొక్కు తెలియని దీనుల యధార్థ జీవన స్వరాలు

 

నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి

ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిచెయ్యాలి

జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ

కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

 

నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలుపోతాను

నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను

నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను

నేను సైతం నేను సైతం...  బ్రతుకు పాటకు గొంతు కలిపేను

నేను సైతం నేను సైతం...  బ్రతుకు పాటకు గొంతు కలిపేను

 

సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా

ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా

పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

 

నేను సైతం..  నేను సైతం..  నేను సైతం

నేను సైతం..  నేను సైతం..  నేను సైతం

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి