30, డిసెంబర్ 2021, గురువారం

కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పాట లిరిక్స్ - Komma Veedi Guvva Veluthondile Song Lyrics in Telugu - Jaanu (2020) Telugu Songs Lyrics









చిత్రం : జాను (2020) 

సంగీతం : గోవింద్ వసంత  

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : చిన్మయి, గోవింద్ వసంత్   

 


కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె 

పువ్వు కంట నీరే కురిసే

అమ్మ ఒడి వీడే పసిపాపలా 

వెక్కి వెక్కి మనసే తడిసే

 

చదివే బడికే వేసవి సెలవులా 

తిరిగి గుడికే రావాలి నువ్విలా

ఒక్కపూట నిజమై మన కలలు ఇలాఆ ఆ

ముందరున్న కాలం గడిచేది ఎలా 

బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా

 

కన్ను వీడి చూపే వెళుతోందిలే 

కంట నీరు తుడిచేదెవరే

 

చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే 

నిను విడువనీ ఏ నన్నో వెతికేనులే

చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే 

మన ఊసులే జతలేక ఎడబాసెలే

 

నా నుంచి నిన్నే 

విడదీసేటి విధినైనా

వేధించి ఓడించె ఇంకో జన్మే 

వరమే వరమే

 

మనం మనం చెరో సగం 

చెరో దిశల్లే మారినా

ఒకే స్వరం ఏకాక్షరం 

చెరో పదంలో చేరినా

నువ్వున్న వైపు తప్ప 

చూపు తప్పు దిశను చూపునా

 

అడుగులన్ని మనము

కలిసి ఉన్న దారి విడిచేనా

మరీ మరీ నిన్నడగమంది 

జ్ఞాపకాల ఉప్పెన

చిరాయువేదో ఊపిరై 

నీకోసమెదురు చూపు

కవితలే రాసే నీకై మళ్ళీ రా



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి