చిత్రం : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : వాణీ జయరాం
చ..చచచచ్చా.. చ..చచ్చచ్చచ...
రోజా లో లేతవన్నెలే.. రాజా కే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు.. నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు.. వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ.. ఓహో మన్మథా!
మైకం సాగనీ.. దాహం తీరని...
రోజా లో లేతవన్నెలే.. రాజా కే తేనెవిందులే..
మొన్న చిగురేసెనే.. నిన్న మొగ్గాయెనే
నేడు పువ్వాయెనే.. తోడుకల్లాడెనే...
సందేళ వయసెందుకో..ఓ..ఓ.. చిందులేస్తున్నది...
అందాల సొగసే నిను అందుకోమన్నది...
క్షణంక్షణం ఇలాగే.. వరాలు కోరుతున్నది చిన్నది...
రోజాలో లేతవన్నెలే... రాజాకే తేనెవిందులే...
చా..చచ్చచా...
చా..చచ్చచా...
ముద్దుమురిపాలలో... సద్దులే చేసుకో...
వేడి పరువాలలో..ఓ... పండగే చేసుకో....
నా చూపులో ఉన్నవి... కొత్త కవ్వింతలు..
నా నవ్వులో ఉన్నవీ..ఈ... కోటి కేరింతలు...
ఇవే.. ఇవే.. ఇవేళా.. సుఖాలపూల వేడుక..వేడుక
రోజా లో లేతవన్నెలే.. రాజా కే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు.. నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు.. వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ... ఓహో మన్మథా!
మైకం సాగనీ.. దాహం తీరని...
రోజా లో లేతవన్నెలే.. రాజా కే తేనెవిందులే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి