చిత్రం : రాధే శ్యామ్ (2022)
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
గానం : సిద్ శ్రీరామ్
నగుమోము తారలే తెగిరాలే నేలకే
ఒకటైతే మీరిలా చూడాలని
సగమాయే ప్రాయమే కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే
మొహాలనే మీరెంతలా ఇలా
మోమాటమే ఇక వీడెనులే
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్
నగుమోము తారలే తెగిరాలే నేలకే
ఒకటైతే మీరిలా చూడాలని
కదలటమే మరిచెనుగా
కాలాలు మిమ్మే చూసి
అణకువగా నిలిచెనుగా
వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా
అడగనేలేని చెలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడివిడిగా
సమయాలకే సెలవే ఇక
పేరులేనిది ప్రేమకానిది
ఓ కధే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్
మేఘాన్ని వదలని చినుకై
సంద్రాన్ని కలవని నదులై
పరిమితి లేనే లేని
ప్రణయమే ఎంత అందం
అసలు కొలవకా కాలం
మునిగి తేలే దేహాలే
తుదకు తెలియని దూరం
మరిచి కలిసెలే స్నేహం
ముగిసేటి గమ్యమే లేని పయనమిదే
మురిసేటి అడుగులతోనే
ఓ కథే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్
నగుమోము తారలే తెగిరాలే నేలకే
ఒకటైతే మీరిలా చూడాలని
సగమాయే ప్రాయమే కదిలేను పాదమే
పడసాగే ప్రాణమే తన వెనకే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి