21, డిసెంబర్ 2021, మంగళవారం

మూగ మనసులు మూగ మనసులు పాట లిరిక్స్ - Mooga Manasulu Song Lyrics in Telugu - Mahanati (2018) Telugu Songs Lyrics










చిత్రం : మహానటి (2018)

సంగీతం : మిక్కీ జె మేయర్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : అనురాగ్ కులకర్ణి, శ్రేయ ఘోషల్



మూగ మనసులు

మూగ మనసులు


మన్ను మిన్ను కలుసుకున్న సీమలో

నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో


జగతి అంటే మనమే అన్న మాయలో

సమయం అన్న జాడ లేని హాయిలో


ఆయువే గేయమై స్వాగతించగా

తరలి రావటే చైత్రమా

కుహు కుహు కుహు

స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ


మూగ మనసులు

మూగ మనసులు


ఊహల రూపమా ఊపిరి దీపమా

నా చిరునవ్వుల వరమా

గాలి సరాగమా పూల పరాగమా

నా గత జన్మల రుణమా


ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో

నిన్నలు రేపులు లీనమైన నేటిలో

ఈ నిజం కథ అని తరతరాలు చదవని

ఈ కథే నిజమని కలలలోనే గడపని

వేరేలోకం చేరే వేగం పెంచే మైకం

మననిలా తరమని

తారాతీరం తాకే దూరం

ఎంతో ఏమో అడగకే ఎవరని


మూగ మనసులు

మూగ మనసులు


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి