11, డిసెంబర్ 2021, శనివారం

చివరకు మిగిలేదీ పాట లిరిక్స్ - Chivaraku Migiledhi Song Lyrics in Telugu - Mahanati (2018) Telugu Songs Lyrics










చిత్రం : మహానటి (2018)

సంగీతం : మిక్కీ జె మేయర్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : సునీత

 


అనగా అనగా మొదలై కథలు

అటుగా ఇటుగా నదులై కదులు

అపుడో ఇపుడో దరిజేరునుగా

కడలే ఓడై కడదేరునుగా

గడిచే కాలానా గతమేదైనా

స్మృతి మాత్రమే కదా... ఆఆఆఆఆ...

 

చివరకు మిగిలేదీ.. చివరకు మిగిలేదీ..

చివరకు మిగిలేదీ.. చివరకు మిగిలేదీ..

 

ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే

నీవు ధరించిన పాత్రలు అంతే

నీదని పిలిచే బ్రతుకేదంటే

తెరపై కదిలే చిత్రమె అంతే

ఈ జగమంతా నీ నర్తనశాలై

చెబుతున్న నీ కథే

చివరకు మిగిలేది

 

విన్నావా మహానటి

చెరగని చేవ్రాలిది

నీదేనే మహానటి

చివరకు మిగిలేది

విన్నావా మహానటి

మా చెంపల మీదుగా

ప్రవహించే మహానది


మహానటి మహానటి

మహానటి మహానటి

మహానటి మహానటి

మహానటి మహానటి


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి