20, జూన్ 2021, ఆదివారం

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Aasa Aasaga Adigindi Maatho Saavaasam Telugu Song Lyrics - Sankranthi (2005) Telugu Song Lyrics





చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

కనరాని దైవం కరుణించలేదా 
తలితండ్రులుగా కనిపెంచి
సేవించు భాగ్యం కలిగించ లేదా 
శివపార్వతులై కనిపించి
కైలాసంలా కొలువుంది 
చల్లని మా చెలిమి
కల్మషం మన్నది తెలియంది 
మా మమతల కలిమి
ప్రేమకుమించిన పెన్నిధి ఏముందీ

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

హరివిల్లులోని వర్ణాలు అన్నీ 
మా కన్నులలో నిలవాలి
సిరిమువ్వలోని సరిగమలు అన్నీ 
మా గుండెలలో పలకాలి
మా లోగిలిలో ప్రతి రాత్రి 
దీపావళి కాంతి
మాముంగిలిలో ప్రతి ఉదయం 
ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వుల పొదరిల్లే మాది

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా ఈ లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం

స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స

స రి ప మా గ రి స రి సా ని స 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి