8, జూన్ 2021, మంగళవారం

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Ninnu Thalachi Maimaracha Chitrame Adi Chitrame Song Lyrics in Telugu - Vichitra Sodarulu (1989) Telugu Songs Lyrics












చిత్రం : విచిత్ర సోదరులు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం





నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే

ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే
ఓ చెలీ...

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే 

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హోరు గాలిలోన ఊకనైతి నేనే

గాలి మేడలే కట్టుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా..
కల చెదిరెను కాదా.. అంతే..

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే 

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపొయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు

రాసి ఉన్న తల రాత తప్పదు..
చిత్రమే.. అది చిత్రమే..
గుండె కోతలే నాకు ఇప్పుడు
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా..
అంతే..

నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదని
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే.. ఓ చెలీ..
 
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి