12, జూన్ 2021, శనివారం

పూసింది పూసింది పున్నాగ పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Poosindi Poosindi Punnaga Telugu Song Lyrics - Seetharamayya Gari Manavaralu (1991) Telugu Songs Lyrics






చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

హహ..పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి