11, జూన్ 2021, శుక్రవారం

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా - బాలు గారి స్మరణ లో - Jaamu Rathiri Jaabilamma Jolapaadana Ilaa Telugu Song Lyrics - Kshana Kshanam (1991) Telugu Songs Lyricsచిత్రం : క్షణం క్షణం  (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా

కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో

చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా 
ఊఊఊహ్.హ్.హ్. ఆహ
స్వరాల ఊయలూగు వేళ

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

 
Blogger Templates