9, జూన్ 2021, బుధవారం

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Subhalekha Rasukunna Yadalo Epudo Telugu Song Lyrics - Kondaveeti Donga (1990) Telugu Songs Lyrics





చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో  
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి