19, జూన్ 2021, శనివారం

కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం పాట లిరిక్స్ - Kalyanam Kamaneeyam Okatayye Velana Vaibhogam Song Lyrics in Telugu - Pushpaka Vimaanam (2021) Telugu Songs Lyrics

 






చిత్రం : పుష్పక విమానం (2021)

సంగీతం : రామ్ మిర్యాల 

సాహిత్యం : కాసర్ల శ్యామ్

గానం : సిద్ శ్రీరామ్, మంగ్లీ


అమ్మలాలో పైడి కొమ్మలాలో

ముద్దుల కొమ్మలాలో 


సందళ్ళు నింపారే పందిళ్ళల్లో 

బంగారు బొమ్మలాలో


మోగేటి సన్నాయి మోతాల్లలో సాగేటి సంబరాలో 

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలో 


కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం  

కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం 


మూడే ముళ్లట ముడిపడుతుంటే ముచ్చట 

నాలుగు దిక్కుల కంట 

చూడ ముచ్చటైన వేడుకంట 


ఆ పంచభూతాల తోడుగా 

ప్రేమ పంచుకునే పండగంట


ఆరారు కాలాల నిండుగా 

ఇది నూరేళ్ళ పచ్చని పంట 


అమ్మలాలో పైడి కొమ్మలాలో 

ముద్దుల కొమ్మలాలో 


ఇంటిపేరు మారే ఈ తంతులో 

చుక్కలే అక్షింతలో 


మోగేటి సన్నాయి మోతాల్లలో సాగేటి సంబరాలో 

పలకరించే తడి ఓ లీలలో 

పుట్టినింట కళ్ళలో 


ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా 

ఏడు జన్మలా బంధంగా 


ఎనిమిది గడప దాటి 

ఆనందాలు చూడగా 

మీ అనుబంధమే బలపడగా 


ఇక తొమ్మిది నిండితే నెల 

నెమ్మ నెమ్మదిగా తీరే కల 

పది అంకెల్లో సంసారమిలా 

పదిలంగా సాగేటి అల


ఒకటయ్యేనంట ప్రాణం 

ఒకరంటే ఇంకోకరి లోకం 


ఇద్దరు చెరో సగం 

ఇక ఇద్దరిదంట కష్టం సుఖం 


అమ్మలాలో పైడి కొమ్మలాలో 

ముద్దుల కొమ్మలాలో 


సందళ్ళు నింపారే పందిళ్ళల్లో 

బంగారు బొమ్మలాలో


మోగేటి సన్నాయి మోతాల్లలో సాగేటి సంబరాలో 

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలో 


అమ్మలాలో పైడి కొమ్మలాలో 

ముద్దుల కొమ్మలాలో 


సందళ్ళు నింపారే పందిళ్ళల్లో 

బంగారు బొమ్మలాలో


మోగేటి సన్నాయి మోతాల్లలో సాగేటి సంబరాలో 

కోయిలాలో రామ సిలకలాలో

పలకండి మంతరాలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి