13, జూన్ 2021, ఆదివారం

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Singarala Pairullona Bangaraale Pandenanta Telugu Song Lyrics - Dalapathi (1991) Telugu Songs Lyrics

చిత్రం : దళపతి (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.జె.ఏసుదాసు, కోరస్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...

వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి 
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా 
పొంగే పాలు అందరి పాలు హాయిగా...
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు 
అంతకంటే సందడేది లేదే... హోయ్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ..
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే..
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ..
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి