10, జూన్ 2021, గురువారం

ఓ పాపా లాలి జన్మకే లాలి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - O Papa Laali Janmake Laali Telugu Song Lyrics - Geethanjali (1989) Telugu Songs Lyrics





చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

నా జోలలా లీలగా తాకాలని 
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని 
కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
ఇరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి 
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని 
తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి