1, జూన్ 2021, మంగళవారం

ఎవడురా కూసింది కమ్యూనిజం పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Evadura Koosinidi Communism Chacchipoyindhani Song Lyrics in Telugu - Lal Salaam (1992) Telugu Songs Lyrics

















ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి జయంతిని ( జూన్ 4 ) పురస్కరించుకొని, ఈ నెల మొత్తం ఆయన పాటలను స్మరించుకుందాం.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~











చిత్రం : లాల్ సలామ్ (1992)
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 







ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని 
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని 
తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం 
రక్తం ఎర్రగ నిలిచినంత కాలం

అజేయంరా విప్లవం దాన్నాపటం ఎవడబ్బతరం 
అజేయంరా విప్లవం దాన్నాపటం ఎవడబ్బతరం 

నో .. నెవర్ ... 

ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని 
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని 

లెనిన్ విగ్రహం కాడురా కూల్చేస్తే ముక్కలైపోదురా
లెనిన్ నంటే అట్టడుగు జనంరా పడిలేచాడ ప్రళయగ్నిరా
ఆకలితో నిరుపేదల పేగులు అరిచినంత కాలం 
శ్రమజీవుల కళ్లల్లో కన్నీరు ఒలికినంత కాలం 

ఆగదు విప్లవ చైతన్యం 
పోరాడుతుందిరా జనసైన్యం 

యస్ !! ఫర్ ఎవర్ !!! 

ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని 
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని 

ఈ విత్తు మార్క్స్ నాటిందిరా
ఈ చెట్టు లెనిన్ పేర్చిందిరా 

వీరుల రక్తంతో తడిసి
ఇది వెయ్యి కొమ్మలయ్యిందిరా
ఈ కొమ్మలు నరికేదెవడురా 
ఈ పళ్లను దోచేదెవడురా 

ఎవడురా ?  ఎవడు ? ఎవడు.. ? 

ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని 
ఎవడురా తెగ వాగింది ఎర్రజెండ వరిగిందని 

ఎవడైనా బరితెగించి వస్తే 
ఎదురుగ నిలిచి సవాలు చేస్తే 
దళితుల ఊపిరి ఉప్పెనగా 
నిర్భాగ్యుల గుండెలు నిప్పులుగా 

దళితుల ఊపిరి ఉప్పెనగా 
నిర్భాగ్యుల గుండెలు నిప్పులుగా 
చెమటోడ్చే కండలు బండలుగా 
బతుకిడ్చే పేదలు దండులుగా 

ఉరిమి పడి తిరగ పడి 
ఉరిమి పడి తిరగ పడి 

భూస్వాములను బూర్జువాలను
భూస్థాపితం చేసేస్తాం 

విప్లవానికి తిరుగులేదని 
ఎర్రజెండాకు ఎదురులేదని 
విశ్వమంతటా ఘోషిస్తాం 

శ్రమశక్తిదే గెలుపని శాసిస్తాం
శ్రమశక్తిదే గెలుపని శాసిస్తాం 

శాసిస్తాం శాసిస్తాం శాసిస్తాం
 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి