25, జూన్ 2021, శుక్రవారం

పుణ్య భూమి నా దేశం నమో నమామి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Punyabhoomi Naa Desam Song Lyrics in Telugu - Major Chandrakanth (1993) Telugu Songs Lyrics




















చిత్రం : మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి   
సాహిత్యం : జాలాది
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 







పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహొజ్వలిత చరిత గన్న 
భాగ్యోదయ దేశం.. నా దేశం 

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి

అదుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి
మతొన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదుటిపై 
నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు 
సార్వభౌముడు...

అడుగొ అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోసావా
నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూర్చావా
ఒరేయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు
తిని బతికె నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా
అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి, 
స్వరాజ్య పొరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు 
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి

అదిగదిగో అదిగదిగో ఆకాశం బళ్ళున తెల్లరీ
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి 
అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా
మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన 
దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటె 
ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి 
పన్ను కడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
మందీ మార్బల మెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
వందే మాతరం వందేమాతరం
వందే మాతరం వందేమాతరం 
వందేమాతరం అన్నది ఆ ఆకాశం

అజాదు హిందు ఫౌజు దళపతీ నేతాజీ
అఖండ భరత జాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమనీ
స్వతంత్ర భరతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చేయాలని
హిందు ఫౌజు జై హిందని నడిపాడు
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

గాంధీజి కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
ధృవతారల కన్నది ఈ దేశం
చరితార్దుల కన్నది 
నా భరత దేశం నా దేశం

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి


నన్ను కన్న నా దేశం నమో నమామి

అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి