బాలు గారు మన మధ్య లేరంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను, మనం వినే ప్రతి పాటలో ఆయన బ్రతికే ఉన్నారు .బాలు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని (జూన్ 4 ) ఈ నెల మొత్తం ఆయన పాటలను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాడిన ప్రతి ఒక్క పాట సాహిత్యాన్ని ఈ బ్లాగ్ లో పొందుపరచటానికి ప్రయత్నిస్తాను.
చిత్రం : తీరం (2021)
సాహిత్యం : అనిల్ ఐనమడుగు
సంగీతం : ప్రశాంత్ బీజే
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ
ఓ క్షణమే మురిపిస్తోంది మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
కనులపై కల అవుతోంది కునుకే రానీకుంది
ఏకాంతం విలపిస్తోంది తన కాంతి కావాలనంది
తోడుగా తను నడిచోస్తుంటే వాన నన్ను తడిపేస్తోంది
గొడుగు నన్ను వదిలేస్తానంది నా నీడ నన్ను విడిచింది
నిన్నటి నన్నే చంపేస్తోంది నన్నే కొత్తగా చూపిస్తోంది
గుండె చప్పుడే ప్రేమగా మారింది
తన ఊసు మానితే ఆడను అంటోంది
నిరీక్షణలో నిలబెడుతోంది ప్రతీక్షణం తనకై చూస్తోంది
కన్నీరే భయపెడుతోంది తనుంటే నే రానంటుంది
స్పర్శతో నను కదిలిస్తుంటే మనసు మాట విననంటోంది
హద్దులను దాటేయ్ అంటోంది పెదవి జారి నను తాకింది
నా యదలో అలజడి రేపేస్తోంది
నా వ్యధనే బయటకు తోసేస్తోంది
నా కధలో మలుపులు తెచ్చేసింది
అణువణువున ప్రేమను నింపేసింది
నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ
నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ
ఓ క్షణమే మురిపిస్తోంది మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ