చిత్రం : నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కె.కె.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
యెదలోతులో.. యేమూలనో..
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బు గాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటూ
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
యెదలోతులో.. యేమూలనో..
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి