11, నవంబర్ 2021, గురువారం

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను పాట లిరిక్స్ - Nenusaitham Prapanchaagniki Samidhanokkati Aahuthicchanu Telugu Song Lyrics - Tagore (2003) Telugu Songs Lyrics







చిత్రం : ఠాగూర్ (2003)

సంగీతం : మణిశర్మ

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


 

నేను సైతం ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వ వృష్టికి

అశ్రువొక్కటి ధారవోసాను

నేను సైతం భువన ఘోషకు

వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

 

నేను సైతం ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను

 

అగ్నినేత్ర ఉగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా

అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా

పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా

హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా

మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా

భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా

 

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా

లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా

ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా

కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా

సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా

లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

 

నేను సైతం ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వ వృష్టికి

అశ్రువొక్కటి ధారవోసాను

నేను సైతం భువన ఘోషకు

వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

 

నేను సైతం ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి