8, నవంబర్ 2021, సోమవారం

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు పాట లిరిక్స్ - Tippulu Tippulu Dhuppati Chillulu Telugu Song Lyrics - Godavari (2006) Telugu Songs Lyrics










చిత్రం : గోదావరి (2006)

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

సాహిత్యం :  వేటూరి సుందరరామమూర్తి

గానం : శ్రేయా ఘోషల్


 

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు

గాలివాన హొరుజల్లులూ

ఏటిలో చేపలు చేతిలో పాపలు

ఛెంగుమన్న నీటి జింకలూ

జిల్లుజిల్లున జల్లు ముద్దులు

చేసిపోయె ముద్దముద్దగా

మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులూ

కళ్ళలోన కన్నుగీటగా

కానలా మేడలా చినుకుమన్న జాడలా

 

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు

గాలివాన హొరుజల్లులు

ఏటిలో చేపలు చేతిలో పాపలు

ఛెంగుమన్న నీటి జింకలు

 

గాలీ వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా

వానా రేవు పిన్నా పెద్ద సయ్యటాడగా

గూటిపడవలో గువ్వ జంటలూ

కూత పెట్టు లేత వలపులూ

లంగరేసినా అంది చావని

రంగసాని చాటు పిలుపులు

రాకడో పోకడో రాములోరికెరుకలే

 

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు

గాలివాన హొరుజల్లులూ

ఏటిలో చేపలు చేతిలో పాపలు

ఛెంగుమన్న నీటి జింకలూ

 

ఏరూ నీరు ఓ దారైతే ఎదురీదాలిలే

ఎండా వాన కొండా కోన నీళ్ళాడాలిలే

ఘల్లుఘల్లున సాని కిన్నెరా

గౌతమింట గజ్జెకట్టెలే

ఎంగిలంటని గంగవంటిది

పండు ముసలి శబరి తల్లిలే

ఆడరా పాడరా తోకలేని వానరా

 

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు

గాలివాన హొరుజల్లులు

ఏటిలో చేపలు చేతిలో పాపలు

ఛెంగుమన్న నీటి జింకలు 

 

జిల్లుజిల్లున జల్లు ముద్దులు

చేసిపోయె ముద్దముద్దగా

మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులు

కళ్ళలోన కన్నుగీటగా 

కానలా మేడలా చినుకుమన్న జాడలా

 

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు

గాలివాన హొరుజల్లులూ

ఏటిలో చేపలు చేతిలో పాపలు

ఛెంగుమన్న నీటి జింకలు

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి