1, నవంబర్ 2021, సోమవారం

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం పాట లిరిక్స్ - Ye Sakhuni Aadani Joodham Brathuke Telugu Song Lyrics - Leader (2009) Telugu Songs Lyrics








చిత్రం : లీడర్ (2009) 

సంగీతం : మిక్కీ జె మేయర్ 

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : నకేష్ అజీజ్


 

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం

ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం

ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో

ఈ నేరం ఇక దూరం ఇది మాతరం

 

వందేమాతరం వందేమాతరం

వందేమాతరం వందేమాతరం

 

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం

ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం

ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో

ఈ నేరం ఇక దూరం ఇది మాతరం

 

వందేమాతరం వందేమాతరం

వందేమాతరం వందేమాతరం

 

మిగిలిన ఆ దిక్కుగా నిలిచినా నాతల్లికై

పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై

రాజ్యాలేలే ఈ డబ్బు హోదా

కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా

వచ్చే ఆపద విచ్చే పూపొద నడిపిస్తా కదా

 

వందేమాతరం వందేమాతరం

వందేమాతరం వందేమాతరం 

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి