చిత్రం : జాను (2020)
సంగీతం : గోవింద్ వసంత
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : గోవింద్ వసంత, చిన్మయి
సందీప్ రెడ్డి వంగ
కాలాల ప్రేమ
పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా
యుగాల ప్రేమ
జాగాలనేలుతోంది రాజు లాగ
శపించు వరమా
పూసే పువ్వోటి చాలే..
లోకాన్ని గెలిచి చూపుతోందే
తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే
ఈ ప్రేమ కావ్యం రాసింది
ఎవ్వరంటే ఏమో కదా
ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే
వివరమేది లేదంది కాలం
కాదన్న ప్రేమ నీడలాగా వస్తుందే
అవునన్న ప్రేమ చేతికంది రాదే
ప్రేమల్లో పడితే మాయలాగా ఉంటుందే
ప్రేమల్లో చెడితే ప్రాణమే నిశి
ఆగనంటూనే సాగదే
సాగనంటూనే ఆగదే
అన్ని అంటూనే మూగదే
ప్రేమకేది సాటిరాదే
ప్రాణమెంతున్న చాలదే
జన్మలెన్నున్న మారదే
విశ్వమంతున్న ప్రేమదే
గుప్పెడంత గుండే
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే
ఓ ఓ చిన్ని మౌనములోన
ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం
ఊసు కలపదే ప్రేమలకే ఊపిరిదే
ఊహలే ఊహలే నిను విడవవులే…
గుండెకే ప్రాణమై పూసే పూసే…
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళా ఆ ఆ ఆ
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే…
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే…
ఓ..ఓహో శ్రీకారమే ఆకారమే
ఓంకారం ప్రేమే
ఓ..ఓహో అనంతమే
అనంతమే ఇదంతా ప్రేమే
చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని
నీ గుండె చప్పుడు
నీకు ముందే చెబుతుంది.
ప్రేమ!
ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది
దాన్ని కౌగిలించు కంటిరెప్పలో దాచు
ప్రేమ ఆగి చూస్తుంది
ప్రేమ తడబడుతుంది
ప్రేమ నవ్వుతుంది
ప్రేమ కవ్విస్తుంది
కవిత్వం రాస్తుంది
ప్రేమ ఏడుస్తుంది.
ప్రేమ కల్లోలంలో పడేస్తుంది
ప్రేమ కాస్తంత అర్థమవుతుంది
ప్రేమ విరహాన్ని పెంచుతుంది
ప్రేమ వీడిపోతుంది
వెళ్లి రమ్మని ప్రేమకి
తలుపు మూసినా
చప్పుడవ్వని
వీడుకోలు ఇవ్వు
వేచి ఉండు...
ఒకవేళ ప్రేమ మళ్ళీ వస్తే
దూరంగా ఆగి చూస్తే
దగ్గరగా వెళ్ళు
ప్రేమతో పిలుపు నివ్వు
అది చాలు
ప్రేమ నీ సొంతం
నీ హృదయం ప్రేమ సొంతం
మార్పులే ప్రశ్న
మార్పులే సమాధానం
ప్రేమ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి