చిత్రం : కురుప్ (2021)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : సుషిన్ శ్యామ్
గానం : హరిప్రియ
ఇది పరవశమో తొలి కలవరమో
యద మలుపులలో మెదిలిన స్వరమో
పెదవొనికినది నిను పిలిచినది
నిను తలువగనే మధువొలికినది
అణువణువు ఓ అలజడి కలిగే
ఒక విరహములు వెచ్చంగా ఒరిగే
తనువే సంద్రమైనది ప్రియసఖుడా
క్షీరసాగరమేగా అనురాగం
కసికసి తనువుల ప్రియరాగం
నిండు యవ్వనమేగా ఒక యోగం
వయసులు కలబడు సుఖభోగం
ప్రియుడా ప్రియుడా ప్రియతమ సఖుడా
కలలో ఇలలో నిను విడగలనా
సొగసుల భారం పెరిగినదో
ఈ సమరమే సఖుడా ప్రియమోయి
ఇది పరవశమో తొలి కలవరమో
యద మలుపులలో మెదిలిన స్వరమో
అణువణువు ఓ అలజడి కలిగే
ఒక విరహములు వెచ్చంగా ఒరిగే
తనువే సంద్రమైనది ప్రియసఖుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి