16, నవంబర్ 2021, మంగళవారం

కదులు కదులు పద చక చక తలపడు పద పాట లిరిక్స్ - Kadhulu Kadhulu Padha Chaka Chaka Thalapadu Telugu Song Lyrics - Munna (2007) Telugu Songs Lyrics










చిత్రం : మున్నా (2007)

సంగీతం : హ్యారీస్ జయరాజ్

రచన : విశ్వ

గానం : కె.కె., విశ్వ 

 


కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

హో ఉవ్వేతైన ఉత్సాహాలు హోరేత్తాయి నేడు

ఉత్తేజాలు వెర్రెత్తాక చూపేయ్ జోరు

ముల్లోకాలు కమ్మేదాక చల్లారేది లేదు

దక్కేదేదో చిక్కేదాక తాడోపేడో తెల్చేయ్యాలా

అందనిదేది ఇలలోన మనసే పెడితే జానోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

 

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

 

సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా

తెలివిగా మనసును మదియిస్తే విజయం మనదేరా

నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం

కృషి తోడై ఉంటే దిగి రాదా స్వర్గం

పంచేయ్ ఉల్లాసం నింపేయ్ చైతన్యం

కూల్చెయ్ కల్లోలం సాగీ ప్రస్థానం

 

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

 

పదుగురు నడిచిన బాటలలో మసలితే పసలేదోయ్

విధిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలోయ్

సమరానికి సై సై పద పదరో రయ్ రయ్

విలయాలను వంచేయ్ వలయాలను తుంచేయ్

రారో రా నేస్తం నీ దే ఆలస్యం

చేసేయ్ పోరాటం అది నీ కర్తవ్యం.

 

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

హో ఉవ్వేతైన ఉత్సాహాలు హోరేత్తాయి నేడు

ఉత్తేజాలు వెర్రెత్తాక చూపేయ్ జోరు

ముల్లోకాలు కమ్మేదాక చల్లారేది లేదు

దక్కేదేదో చిక్కేదాక తాడోపేడో తెల్చేయ్యాలా

అందనిదేదీ ఇలలోన మనసే పెడితే జానోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

అందనిదేదీ ఇలలోన మనసే పెడితే జానోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి