చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
ఓంనమః నయన శ్రుతులకు
ఓంనమః హృదయ లయలకు ఓం...
ఓంనమః అధర జతులకు
ఓంనమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో... ఓఓఓఓ..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..
రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం...
ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగా మారనా..
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి...ఓం..
ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..
Endaro mahanubhavulu andariki vandanamulu.
రిప్లయితొలగించండి