7, జులై 2020, మంగళవారం

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో పాట లిరిక్స్ - Mahila Ika Nidura Nunchi Meluko Song Lyrics in Telugu - Madam (1993) Telugu Songs Lyrics





ఇక్కడ ఈ పాటని చూడండి








చిత్రం : మేడమ్ (1993)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం






మహిళా ఇక నిదుర నుంచి మేలుకో
తరతరలా నీ దుస్థితి తెలుసుకో
చలో ముందుకు భయాలెందుకు
స్వశక్తి చూపి సాగు ముందుకు

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో
తరతరలా నీ దుస్థితి తెలుసుకో
చలో ముందుకు భయాలెందుకు
స్వశక్తి చూపి సాగు ముందుకు


మగవారికి చదువుకట
మగువకేమో పెళ్లికట
పొదుపు చేయమంటాయి భీమాలు
స్త్రీ జాతికింక లేవా ఏ ధ్యేయాలు ???

పదినెలలు మోసి మోసి
కంటి పాప లాగ పెంచు
కష్టాలన్నీ కన్న తల్లివా
బిడ్డడి ఇంటి పేరు చూస్తే వాడబ్బదా

పసుపు తాడు కట్టి నీ మెడలు వంచినా
పతివ్రతల కతలు చెప్పి అణగదొక్కినా
భరించావు నువ్వు సోదరీ
మారలిక నీ వైఖరి

కదలిరా గడప దాటి కదలిరా

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో
తరతరలా నీ దుస్థితి తెలుసుకో
చలో ముందుకు భయాలెందుకు
స్వశక్తి చూపి సాగు ముందుకు

ప్రెజర్ కుక్కరైన వాషింగ్ పౌడరైనా
ఆడదాన్నే మోడల్ గా చూపాలా
వంట ఇంటి కూచివన్నా ముద్ర వెయ్యాలా

ఆడదానివంటు నీకేమి తెలుసునంటూ
ఇంటా బయట హేళన చేస్తూంటే
నువ్వు అణిగి మణిగి బానిసలా ఉండాలా

అడ్డులేని స్వాతంత్ర్యం మగధీరులకా
బాధలు భోధలు ఆడపిల్లకా
సాగాలి ఈ విప్లవం
మనదేలే అంతిమ విజయం

నిలబడు ఎదురు తిరిగి కలబడు

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో
తరతరలా నీ దుస్థితి తెలుసుకో
చలో ముందుకు భయాలెందుకు
స్వశక్తి చూపి సాగు ముందుకు

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో
తరతరలా నీ దుస్థితి తెలుసుకో
చలో ముందుకు భయాలెందుకు
స్వశక్తి చూపి సాగు ముందుకు 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి