ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : బిజిబల్
గానం : గౌతమ్ భరద్వాజ్, సౌమ్య రమ్యకృష్ణన్
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : బిజిబల్
గానం : గౌతమ్ భరద్వాజ్, సౌమ్య రమ్యకృష్ణన్
అనందం ......
ఆరాటం .......
అనందం అంటే అర్ధం చూపించేటి
ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే
ఈ సంబరం
చిగురై పుడమి కడుపున
మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగేతీసే
పయనం ఇక ప్రతి పూటోక
కానుక అయిపోదా
నీరు ఆవిరిగ ఎగిసినది
తపన పెరిగి అది కడలినొదిలినది
కారు మబ్బులుగ మెరిసినది
అనువు అనువు
ఒక మధువుగ మారి
తానే ..... వానై .......
అడుగు అడుగు కలిపి
కదిలిపోయే కడలింటి దారే
మలుపేదైనా గెలుపే చూసే
అడుగుల్లో అసలైన ఆ ఆనందం
కదిలే నదిలో ... ఎగిసే అలలా
ఎదలోపల క్షణమాగని
సంగీతం కాదా
ఇంద్రధనస్సులో వర్ణములే
పుడమి ఒడిలో పడి
చిగురు తొడిగినవి
శరదృతువులో సరిగమలే తడిమే
తొలి పిలుపుగా మారి
దాహం .... తీరే ...
విరుల శిరులు విరిసి
మురిసిపోయే
సరికొత్త మాయే
ఉబికే మౌనం
ఉరికే ప్రాణం
తన కోసం దిగివస్తే
ఆ .. ఆకాశం
కరిగే దూరం తెరిచే ద్వారం
జగమంతట పులకింతలు
పూసే వాసంతం
అనందం అంటే అర్ధం చూపించేటి
ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే
ఈ సంబరం
చిగురై పుడమి కడుపున
మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగే తీసే
పయనం ఇక ప్రతి పూటోక
కానుక అయిపోదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి