18, జులై 2020, శనివారం

హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది పాట లిరిక్స్ - Hrudayamentha Thapisthe Brathuku Song Lyrics in Telugu - Needi Naadi Oke Katha (2018) Telugu Songs Lyrics



నాకు ఈ చిత్రం వ్యక్తిగతంగా చాల ఇష్టం. 
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న 
ఒక సమస్యను దర్శకుడు చాల
చక్కగా వివరించారు, ఈ పాటలో 
పూర్తి కధను మనకు తెలియచేశారు

మనసుకు హత్తుకునే ఈ పాట 
నేడు మన నేను నా పాట లో 


ఇక్కడ ఈ పాటని చూడండి









చిత్రం : నీది నాది ఓకే కథ (2018)
సాహిత్యం : ఎం.బి.డి.శ్యామల
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : కె.స్వరూప









హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది 
గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది
రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా?
మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది

మాటలెన్ని జారావో నోటినడుగు చెబుతుంది 
పాటించిననాడే పలుకు విలువ తెలిసింది

చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది
నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది

ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా 
అడుగడుగూ నిషేధానా కాంక్ష విలువ తెలిసింది 

ప్రతి మనిషికి కోరికుంది
ప్రతి మనసుకు స్పందనుంది
అనుభూతులు కొలిచే ఆ మమత విలువ తెలిసింది

హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది
గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది.

జీవితమే మరలిరాని ఒకే ఒక్క వరము కదా
స్వేచ్ఛ అనే ఊపిరిలో
కలల విలువ తెలిసింది






2 కామెంట్‌లు: